నా మొత్తం కెరియర్ లో నేను ఎక్కువగా వయలెంట్ సినిమాలు,హర్రర్ సినిమాలు, యాక్షన్ ధ్రిల్లర్లు తీశారు. అడపాదడపా రంగిలా , మస్త్, ప్రేమకథ లాంటి లవ్ స్టోరీలు తీసినా వాటిల్లో ఒక వయలెంట్ బ్యాగ్రౌండో లేదా ఫిల్మ్ ఇండస్ట్రీ లాంటి ఒక ఫాంటసీ బ్యాగ్రౌండో వుండేది కానీ 365 days లో నేను నా 25 ఏళ్ళ కెరియర్లో మొట్ట మొదటి సారిగా 100% పూర్తి రొమాంటిక్ బ్యాక్ గ్రౌండ్ లో తీసాను..ఈ చిత్రంలో క్యారెక్టర్ లు ప్రతి అబ్బాయిని ప్రతి అమ్మాయిని ప్రతి ప్రేమించే జంటని ప్రతి పెళ్ళయిన జంటని పోలి వుంటాయి....ఇది నా ఒక్క పెళ్లి కధే కాదు..ఇది ప్రతి ఒక్కరి పెళ్లి కధ...ప్రేమ మీద పెళ్లి మీద నాకున్న స్వయనుభావాలని నాకు పరిచయమున్న ఇతర జంటల అనుభవాలతో కలిపి వాటి ఆధారంగా ఈ 365 days సినిమా తియ్యటం జరిగింది...అందుకే ఇది ప్రతి ఒక్కరి ప్రేమ కధ, ప్రతి ఒక్కరి పెళ్లి కధ అంటున్నాను.
వయసొచ్చినప్పటి నుంచే అబ్బాయిని గాని, అమ్మాయిని గాని "పెళ్ళెప్పుడు చెసుకుంటావ్ " అని అయినవాళ్లు కానివాళ్లు నస పెట్టి చావగొట్టేస్తుంటారు. ..కుటుంబంలో వుండే తల్లి తండ్రులు ఇంకా తాతయ్య అమ్మమ్మ అన్నయ్య వదినల్లాంటివాళ్ళు భోజనలవగానే ప్లేటులు కడిగి అలమారాలో పెట్టినట్టు వయసు రాగానే పిల్లలకు పెళ్లి చేసి నిద్రపోవావాలనుకుంటారు..వాళ్ళ మాటలు విని పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయితే , వేరే పెళ్ళైన వాళ్ళు సుఖంగా ఉండక పెళ్లెందుకు చేసుకుంటున్నావ్" అని భయంకరమైన ఎక్స్ప్రెషన్స్ తో భయపెట్టేస్తారు
ఇక ప్రేమ పెళ్ళిళ్ళ గురించి చెప్పాలంటే పెళ్లి ప్రేమ నుంచి రావచ్చేమో కానీ ప్రేమ వచ్చేది జస్ట్ కెమిస్ట్రీ నుంచి. అర్ధం అయ్యి అవ్వనట్టు చెప్పాలంటే చెప్పాలంటే ప్రేమ అనేది ఒక రసాయనిక యాక్షన్. వాళ్ళ ప్రేమ యాక్షన్ ల నుంచి వచ్చే వాళ్ల ఊహలు వాత్సాయన రియాక్షన్...వాటిని సాధించుకోవడానికి వాళ్ళు చేసే యాక్షన్లే రొమాక్షన్.. రొమాక్షన్ ante ప్రేమికులు చేసే రొమాంటిక్ యాక్షన్ కి నేను పెట్టుకున్న ముద్దు పేరు.
మంత్రాలకి చింతకాయలే రాలనప్పుడు పెళ్లి కి మాత్రం రెండు జీవితాల్ని జీవితాంతం కలిపి ఉంచే శక్తి ఉందా??? ఉంటే మరి విడాకుల శక్తి సంగతేంటి??పెళ్ళనేది స్వేచ్చగా ఎగురుతున్న గాలిపటాల్లాంటి జీవితాల్ని కిందకి లాగటమా?
Crackers are made in siva kasi అన్నట్టు నిజంగా marriages are made in heavenaa? ప్రేమ అనేది ఒక ఎమోషనల్ కmmotianaa ? బయలాజికల్ ఓవర్ యాక్షనా ? దానికి లైసెన్స్ ఇచ్చే "పెళ్లి" పేరంట్స్ నీడా? సోషల్ అవసరమా?
చావు కూడా పెళ్లిలాంటిదే బ్రదర్" అని ఎవరో మహాకవి చెప్పినట్టే, "పెళ్లి కూడా చావులాంటిదే" అని బల్ల పగిలిపోయేలా గుద్ది గుద్ది చెప్తారు చాలా మంది పెళ్ళయిన వాళ్ళు. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టనప్పుడు ఈ "పెళ్లి" అనేది శివుడాజ్ఞా? లేక మనిషి చేసుకున్న స్వయకృతాపరాధమా? తన డ్యూటీలో భాగంగా దేవుడు అమ్మాయిల్నీ, అబ్బాయిల్నీ సృష్టిస్తే...మనిషి మాత్రం తన అజ్ఞానంలో భాగంగా పెళ్లిని సృష్టించాడా?
ఇలాంటి సమాధానం లేని చాలా ప్రశ్నలకి ఈ 365 days సమాధానం చెప్తుందా? లేక ఇంతవరకు ఎవరు వెయ్యని మరో ప్రశ్న వేస్తుందా? ఈ విషయం ఈ సినిమా కి డైరెక్టర్ అయిన నాకు కూడా తెలియదు....ఇంతవరకూ నేను చెప్పింది విని నేను పెళ్లి అనే వ్యవస్థకి వ్యతిరేకినని మీకనిపించవచ్చు..కానీ నా ఉద్దేశ్యం అది కాదని ముక్కోటి దేవతల మీద స్టీవెన్ స్పీల్ బెర్గ్ మీద వొట్టేసి చెబుతున్నాను..ఇక సీరియస్ జోకేలేయ్యటం ఆపేసి జోక్ ని సీరియస్ గా చెప్పాలంటే 365 days లో మీరు చూడబోయేది నా ప్రేమ కధే కాదు,ఏ ఒక్క అమ్మాయి ఈ ఒక్క అబ్బాయి ల ప్రేమ కధ కూడా కాదు ... ఇది మనందరి ప్రేమ కధ ...నిజం చెప్పాలంటే ఇది మనందరి పెళ్లి కధ.