ర‌కుల్‌తో తెగ రొమాన్స్ చేస్తున్న హీరో!

March 04, 2015 | 04:09 PM | 59 Views
ప్రింట్ కామెంట్
Ram_romance_with_Rakul_pandaga_chesko_niharonline

టాలీవుడ్ లో ప్రస్తుతం రకుల్ హవా కొనసాగుతోంది. ఎంతలా అంటే బడా బడా హీరోలు సైతం ఆమె హీరోగా ఉంటేనే తప్ప సినిమాలను ఒప్పుకోలేని పరిస్థితి. తక్కువ రెమ్యునరేషన్ పైగా ఫ్రెష్ ఫేస్ కావటం పైగా నటన కూడా బాగా చేయటం ఈ అమ్మడి అడ్వాంటేజ్ లు. తాజాగా ఈ అమ్మడు ఓ మూడు భారీ ప్రాజెక్టుల్లో నటిస్తుందిలేండీ. అందులో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా గోపిచంద్‌మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న చిత్రం పండచేస్కో ఒకటి. ప‌రుచూరి కిరిటీ నిర్మిస్తున్న చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఈ చిత్రంలో రామ్ ఇందులోఎన్నారై పాత్రలో నటిస్తున్నాడట. విదేశాల నుంచి తిరిగి వ‌చ్చి, మ‌న సంప్ర‌దాయాల‌ను తెలుసుకున్న వ్య‌క్తిగా రామ్ క‌నువిందు చేయ‌నున్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమా పాట‌ల చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటుంది. ఒక రొమాంటిక్ సాంగ్ ను రామ్‌, ర‌కుల్ పై చిత్రీక‌రించార‌ట‌. త్వ‌ర‌లోనే రెండో సాంగ్‌ను చిత్రీక‌రించ‌నున్నార‌ని హీరో రామ్ తెలియ‌జేశాడు. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసి సమ్మర్ బరిలో ఈ చిత్రాన్ని దించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని సమాచారం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ