తెలుగు చిత్ర సీమలో పేరెన్నిక గన్న నిర్మాత, మాజీ ఎంపీ డాక్టర్‌రామానాయుడు అనారోగ్యంతో ఆసుపత్రి పాలైనట్లు తెలుస్తోంది. కాగా 78 సంవత్సరాల రామానాయుడు ఇటీవల తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లుగా సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ఆయన మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడుతున్నారని సమాచారం. కాగా రామానాయుడు సురేష్ ప్రొడక్షన్‌బ్యానర్‌పై పలు హిట్ సినిమాలను రూపొందించారు. అలాగే ఆయన బహు బాషా చిత్ర నిర్మాత. ఇక అతని చిత్రాల ద్వారా ఎందరో నూతన నటీనటులు వెండి తెరకు పరిచయమై అనంతరం మంచి పేరును సంపాదించుకున్నారు. అలాగే రామానాయుడుకు సురేష్, వెంకటేష్‌లు ఇద్దరు పుత్ర సంతానం కాగా, వారిరువురూ సినీ పరిశ్రమలో స్థిరపడిన సంగతి తెలిసిందే.