సాధారణంగా హీరోయిన్లకు తెర మీద వేరే వారిచే డబ్బింగ్ చెప్పిస్తుంటారు. వారి అసలు వాయిస్ ఎలా ఉంటుందో ఫ్యాన్స్ తోసహా చాలా మందికి తెలియకుండానే ఉండిపోతుంది. అలాంటి సస్పెన్స్ మెయింటెన్ చేసిన హీరోయిన్లలో రంభ ఒకరు. 90 దశకంలో సినిమాల్లోకి వచ్చిన రంభ సెక్సీ తారగా గుర్తింపు పొందింది. అనంతి కాలంలోనే చిరంజీవి, వెంకటేష్ లాంటి బడా స్టార్స్ తో సినిమాలు చేసింది. అన్ని భాషల్లో కలిపి దాదాపు వంద చిత్రాల దాకా చేసిన రంభ ఎక్కడా తన సొంత వాయిస్ ను వినిపించలేదు. డబ్బింగ్ ఆర్టిస్ట్ తోనే ఆమె చిత్రాలన్నీ కానిచేసింది. అయితే ఇఫ్పుడా సస్పెన్స్ కి తెరపడిపోనుంది. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు పాల్గొనే సౌందర్య లహరి కార్యక్రమానికి రంభ హజరుకానుంది. ఇంతవరకు బుల్లితెరపై కనిపించని రంభ ఈ కార్యక్రమంలో తన గళం విప్పి దర్శకేంద్రుడితో సినీ అనుభవాలను మీడియా సాక్షిగా పంచుకోనుంది. వారం వారం కొత్త కొత్త అతిథులతో సరికొత్తగా ఆసక్తిగా సాగుతున్న సౌందర్య లహరి ప్రోగ్రాం ఈ వారం రంభ అనుభవాలకు వేదికకానుందన్నమాట.