రామ్ చరణ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి విదితమే. దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం కృతికర్భందా చరణ్ సిస్టర్ పాత్రలో చేస్తుంది. సిస్టర్ సెంటిమెంట్ కథతో ఎంటర్ టైన్ మెంట్ ప్రధానంగా సాగే ఈ సినిమా ప్రస్తుతం విదేశాల్లో చిత్రీకరణని జరుపుకుంటుంది. తాజా సమాచారం ప్రకారం ఇటలీలో మొదటి సాంగ్ చిత్రీకరణ పూర్తయిందట. రెండో సాంగ్ కోసం యూనిట్ అంతా స్పెయిన్ వెళుతుంది. ఈ విషయాన్ని హీరోయిన్ రకుల్ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ఈ చిత్రానికి బ్రూస్ లీ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు వార్తలు వినపడుతున్నాయి. నిజానిజాలు తెలియాలంటే కొంతకాలం వెయిట్ చేయాల్సిందే...