ఉత్కంఠ రేపి వదిలిన వర్మ...

May 16, 2015 | 03:18 PM | 51 Views
ప్రింట్ కామెంట్
ram_gopal_mogalipuvvu_stil_niharonline

రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వస్తున్న ‘మొగలి పువ్వు’ సినిమా ఫస్ట్ లుక్ రొమాంటిక్ గా ఉంది. ప్రతి పెళ్లైన వాడి సెల్ ఫోన్ లో తన భార్యకి తెలియని సీక్రెట్లుంటాయ్ అంటూ పోస్టర్ పై రాశారు. నిజంగా ఇప్పుడు జరుగుతున్న విషయాలను ఆపక్తికరంా తెరకెక్కించిన సినిమాగా అనిపిస్తోంది. ఇక ట్రైలర్ చూపించి ఉత్కంఠ రేపి వదిలేశారనిపించింది.... చాలా ఆసక్తి కరంగా రెప్ప వేయకుండా చూడాలనిపిస్తోంది... ట్రైలర్ అయిపోగానే... అబ్బా ఈ సస్పెన్స్ ఎన్నాళ్ళు భరించాలి? అనేంతగా సీన్స్ క్రియేట్ చేశారు.

ఇక  ఈ సినిమా ఎలా వుండబోతుందో వర్మ తనదైన శైలిలో వివరణ ఇచ్చాడు. ‘ప్రతి పెళ్ళైన మగాడూ బయట ఒక అందమైన అమ్మాయి కనిపిస్తే టెంప్ట్ అవుతాడు. ప్రతి భార్య తన భర్తకేదైనా ఒక సీక్రెట్ ఎఫైర్ ఉందేమోనని భయపడుతూ వుంటుంది. ప్రతి పెళ్ళైన వాడి సెల్ ఫోన్ లో తన భార్యకి తెలియని సీక్రెట్ లు ఉంటాయి. ఎఫైర్ లు అనేవి పెళ్లి వ్యవస్థ పుట్టినప్పటి నుంచీ వున్నాయి. కాని సెల్ ఫోన్లలో పాస్ వర్డ్ లు, వాట్స్అప్ లు, పేస్ టైం లు కెమెరాలు వగైరా వచ్చినప్పటి నుంచి అవి ఒక భయంకర స్థితికొచ్చేశాయి. టెక్నాలజీయే కాకుండా స్త్రీల పై అత్యాచారాల పరంపరను అరికట్టడానికి కొత్తగా వచ్చిన నిర్భయ లాంటి చట్ట సవరణలు స్త్రీ పురుష సంబంధాలలో భూకంపాలు పుట్టిస్తున్నాయి. ఇలాంటి బ్యాక్ గ్రౌండ్ తీసుకుని రాసిన కధే మొగలిపువ్వు’ అంటూ చెప్పుకొచ్చారు.

 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ