మనోజ్ పెళ్లి పిలుపులకు మంచు కుటుంబం ప్రధాని మోదీని కలిసిన విషయం అందరికీ తెలిసిందే. ఆ సమయంలో ఈ కుటుంబం మోదీతో కలిసి కొన్ని సెల్ఫీలు దిగింది. వాటిని తమ తమ సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో పోస్టు చేసింది మంచు లక్ష్మీ. ఈ వ్యవహారంపై సినీ నటుడు రానా స్పందిస్తూ.. వాట్ ఏ సెల్ఫీ... ఇది చాలా టూ మచ్ అంటూ కామెంట్ చేశాడు. దానికి లక్ష్మీ టూ మచ్ ఎందుకు రానా గారూ... ఇట్స్ హ్యాపీయ్యేస్ట్ మూమెంట్స్, ప్రైస్ లెస్ అంటూ సమాధానం ఇచ్చింది. ఒకరికి మంచి సంతోషాన్నిచ్చింది... మరోకరికి నచ్చకపోవచ్చు. సినిమా నటులతో షేక్ హ్యాండ్ తీసుకొని ఓ ఫోటో దిగాలని ఎగబడే వారు కొందరయితే. అలా చూస్తూ ఉండిపోయే వారు మరి కొందరు. ఒక్కోరూ ఒక్కోలా స్పందిస్తారు. ఫీలింగ్స్ అందరికీ ఒకేలా ఉండవు కదా... ఇదీ అంతే మరి.