బాహుబలిపై రానా కబుర్లు...

June 08, 2015 | 03:58 PM | 0 Views
ప్రింట్ కామెంట్
rana_daggubati_about_bahubali_niharonline

'' రాజమౌళి ఈ సినిమాను చరిత్రలా తెరకెక్కిస్తున్నారు. పాత్రల రూపకల్పన, చిత్రణ విషయంలో చాలా పక్కాగా ఆలోచించారు. మా పాత్ర స్వభావాలకు తగ్గట్టుగా శరీర కవచాలను సిద్ధం చేశారు. నా కవచం మీద సింహం బొమ్మ, ప్రభాస్‌ కవచం మీద గుర్రం బొమ్మ వేయించారు. ఈ సినిమా సీన్స్ ఎఫెక్ట్స్‌ హాలీవుడ్‌ స్థాయిలో ఉండకపోయినా ఇండియన్ సినిమా స్థాయిని పెంచేలా... సినీ పరిశ్రమ ఒక అడుగు ముందుకేసేలా ఉంటాయి'' అన్నారు రానా. బాహుబలిలో భల్లాలదేవుడి పాత్రలో నటిస్తున్నాడు రానా. ట్రైలర్ విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రానా ఇలా స్పందించారు. ఒక సినిమా కోసం నటీనటులు ఏళ్ల తరబడి కాల్షీట్లు ఇస్తున్నారంటే, ఆ సినిమా... సినిమా తీసే వాళ్ళ గొప్పదనం తప్పకుండా ఉంటుందనీ, ఇలా ఆలోచించే 'బాహుబలి' కోసం మూడేళ్లు కష్టపడ్డానంటున్నాడు రానా. ''రాజమౌళి కథ చెబుతున్నప్పుడు... ఈ సినిమా నేను ఖచ్చితంగా చేయాలి' అని నిశ్చయించుకున్నానన్నారు. ఇలాంటి అవకాశం జీవితంలో ఒక్కసారే వస్తుందనిపించింది. విలన్ పాత్ర అని తెలిసినా.. చాలా అద్భుమైన పాత్ర’ అన్నారు. దీని కోసం నా శరీర దారుడ్యాన్ని చాలా మార్చుకున్నానన్నారు. ‘ఈ సినిమా కోసం మూడేళ్లు వెచ్చించాను అనే ఆలోచన ఎప్పుడూ రాలేదు. ఎందుకంటే ఇన్నాళ్లు పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది. నా పాత్రను అద్భుతంగా మలిచారు రాజమౌళి. యుద్ధం నేపథ్యంలో భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే భారీ స్థాయిలో రూపొందుతున్న సినిమా ఇది’ అన్నారు. కరుణ్ జోహార్ తో టై అప్ గురించి మాట్లాడుతూ.... ''సినిమా అంటే ఎంతో ప్యాషన్‌ ఉన్న వ్యక్తి కరణ్‌ జోహార్‌. ఈ చిత్ర బృందంతో చేతులు కలిపితే బాగుంటుందని ఆయనకు నేనే సూచించాను. సినిమా రంగం మీద ప్రేమతోనే ఆయన మాతో కలిశారు'' అని చెప్పాడు రానా. ఇప్పటికే విడుదలైన ‘బాహుబలి' థియేట్రికల్ ట్రైలర్ కు రెస్పాన్స్ అదిరిపోతోంది. తెలుగు, తమిళం, హిందీలో విడుదలైన ట్రైలర్ కు మిలయన్ల కొద్దీ హిట్స్ వచ్చాయి. ట్రైలర్ రెస్పాన్స్ చూస్తే సినిమాపై అంచనాలు ఏ రేంజిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. సినిమా అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉంటుందని అన్నారు రానా.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ