రానా తనకు ఎదురైన ఓ అనుభవాన్ని ఫన్నీగా ట్వీట్ చేశాడు. ఎయిర్ ఇండియా వారు గోవా కు టికెట్ కు బుక్ చేస్తే ఒకే సీటుపై ఇద్దరికి టికెట్ ఇచ్చారట. ఎయిర్‌లైన్స్ వాళ్ళు వినూత్న వెసులుబాటు కల్పించారు. ఇదో మంచి ఛాన్స్ అంటూ రాణాకు తన అనుభవాన్ని ట్వీట్ చేశాడు.
వావ్.. ఎయిరిండియా జస్ట్ బుక్డ్ టూ పీపుల్ ఆన్ ది సేమ్ సీట్..... అంటూ ట్వీటాడు. అంతే.. ఇది చూస్తే అందరూ ఏదో ఒకటి కామెంట్ చేస్తారు కదా... అందులో త్రిష, తాప్సీ లు ఫన్నీ సెటైర్లు వేశారు రాణాకు. ఇది చాలా ఫన్నీగా ఉందని, కేబిన్ క్రూలో నువ్వు లేడీస్‌తో కూచుని చాట్ చేస్తున్నావనుకున్నానని త్రిష ట్వీటింది. తాప్సీ ఊరుకుంటుందా..? నువ్వు ఎవరి ఒడిలోనో కూచుని ఉంటావ్.. అదెవరో ఊహిస్తున్నా అని ఆ అమ్మడు అందట. ఇంతకూ ఎయిరిండియా వారు ఇలా ఎందుకు చేశారా? ఆ ఇద్దరినీ ఎలా అడ్జెస్ట్ చేశారో మరి... లేక నిజంగానే రానా ఒళ్ళో ఏ అమ్మడైనా కూర్చుందా?