ఇప్పటివరకు నటించిన సినిమాలేవీ సక్సెస్ కాకపోయినా, ఫాన్స్ క్రేజ్ బాగా ఉన్నట్టు కనిపించకపోయినా...ఈ యంగ్ హీరో హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2014 లిస్ట్ లో మొదటి స్థానం దక్కించుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కొంతమంది క్రేజీ స్టార్స్ కు ఇది షాక్ లా తగిలింది. టైమ్స్ పోల్‌లో గత సంవత్సరం ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న మహేష్ బాబును దాటుకుని రానా ఈ స్థానం దక్కించుకున్నాడు. తర్వాతి స్థానాల్లో వరుసగా మహేష్, ప్రభాస్, నితిన్, ఎన్టీఆర్, అఖిల్, త్రివిక్రమ్, కశ్యప్ (బ్యాడ్మింటన్ ప్లేయర్) అల్లు అర్జున్, రామ్ చరణ్ వరుసగా టాప్ 10 స్థానాలు పొందారు. అయితే మొదటి స్థానంలో నిలిచిన రాణా మాట్లాడుతూ ఈ క్రెడిట్ తనకు దక్కడం ఆశ్చర్యంగా, ఆనందంగా ఉందని చెప్పి, డేటింగ్‌లోనూ తనది మొదటి స్థానమే అన్నట్టు చెప్పి షాక్ ఇచ్చి జస్ట్ జోక్ అనేసాడట. నార్త్, సౌత్ హీరోయిన్స్ తో డేటింగ్స్ అంటూ గాసిప్స్ లో రెగ్యులర్‌గా కనిపించే రానా... కొందరు హీరోయిన్స్ పేర్లు వినిపిస్తుంటాయి. నిజమేనా? అని అడిగితే.. వాటిలో కొంత నిజం ఉంది.. ఎక్కువ రూమర్స్ అని చెపుతున్నాడట. 30లో పడ్డావ్ మరి పెళ్ళి చేసుకోవా? అన్న ప్రశ్నకు.. 30 మందితో డేటింగ్ చేసానని చెపుతున్నారు... అని మాటమారుస్తూ... కెరీర్‌లో సెటిల్ అయ్యాకే పెళ్ళి అని చెప్పుకొచ్చాడట. ప్రస్తుతం రానా బాహుబలి ఫస్ట్ పార్ట్ షూట్ ముగించాక, బెంగళూర్ డేస్ రీమేక్‌లో నటిస్తున్నట్టు తెలిపారు.