మళయాళంలో పెద్ద హిట్టయిన బెంగుళూరు డేస్ ను తెలుగులోకి రీమేక్ చేయబోతున్న విషయం తెలిసిందే. బొమ్మరిల్లు భాస్కర్-దిల్ రాజు కాంబినేషన్ వస్తున్న మూడో సినిమా ఇది. ఈ రీమేక్ లో మొదట సిద్ధార్థ-సమంతలు నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ ఇందులో హీరోయిన్ గా శ్రీదివ్యను ఎంపిక చేసినట్టు ఇటీవలే ప్రకటించారు కూడా. అయితే మరో లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే ఇందులో రానా కూడా చేర్చారు. ఈయతో తో పాటుగా ఆర్య, బాబీ సింహా నటించనున్నారని సమాచారం. ఈ చిత్రాన్ని పివిపి సంస్థ మూడు భాషల్లో నిర్మిస్తోంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో తెరకెక్కించబోతున్నారు. ప్రీ పొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. నటీనటుల ఎంపిక కూడా ఇంకా జరగాల్సి ఉంది. మార్చి 20 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుగబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా ఎక్కువశాతం సింగపూర్ లో షూటింగ్ జరుపుకోనున్నట్టు సమాచారం.