ఇప్పటి వరకూ సినిమా స్టార్లే ఈ రోజు ఒకరితో ఎంతో చనువుగా ఉండి, మరునాటికి మరొకరితో అతి ప్రేమ ఒలక బోయడం చూస్తున్నాం... (ఒక వేళ బయటి వారు ఇలా ఉన్నా అందరికీ కనిపించరు కదా...) స్ర్కీన్ మీదే కాదు...బయట ఏ చిన్న పార్టీలోనో, హోటళ్ళలోనూ వాళ్ళు కనపడ్డారంటే జనాలకు వార్తే కదా... అయితే ఎప్పుడూ ఆడియన్స్ ను తెరమీదే కాకుండా వ్యక్తిగత వ్యవహారాల్లోనూ ఎంటర్ టైన్ చేసే సినిమా తారలు... జలసీలు, సెటైర్లు విసురుకోవడం చూశాం ఇంతవరకూ.... తన మాజీ బాయ్ ఫ్రెండ్ తో కొత్తగా ఇంకొకరు కనిపిస్తే భగ్గుమనడం ఇప్పటి వరకూ చూశాం... కానీ ఇందులోనూ మార్పు వచ్చేస్తోందండోయ్... లైట్ తీసుకో... భయ్య లైట్ తీసుకో.... అన్నట్టు రణబీర్ సింగ్ విషయంలో జరుగుతోంది... రణబీర్ మాజీ ప్రియురాళ్ళు దీపికా పడుకొనే, సోనమ్ కపూర్ లు , ఇప్పటి ప్రియురాలు కత్రినా కైఫ్ తో చాలా స్నేహంగా ఉండడం కనిపిస్తోంది. ఆ మధ్య ఓ టీవీ షోలో తమ స్నేహం ఎలా ఉందో చెప్పుకుంటూ.... రణబీర్ మీద జోకులేసారట మాజీ ప్రియురాళ్ళు సోనమ్, దీపికలు, ఇప్పుడు సోనమ్ తో కలిసి ఓ ప్రోగ్రామ్ లో పాల్గొన్న కత్రిన సోనమ్ కు ఓ ముద్దు ఇచ్చేసిందట. ఇదేం విచిత్రం తమ భావాలను ఏ మాత్రం బయటకు కనిపించనీయకుండా ఇలా ఎలా ఉండగలుగుతున్నారు ఇప్పటి సినీ తారలు అని ముక్కున వేలేసుకుంటున్నారు ప్రేక్షకులు.