ఏ తార ఎవరితో జత కడుతుందో... ఎవరితో తెగతెంపులు చేసుకుంటుందో అర్థం కాని పరిస్థితి ఉంది ఇప్పుడు బాలీవుడ్ సినీ తారల విషయంలో. డేటింగ్ చేయడమే కల్చర్ చాలా కామన్ అయిపోయింది. కొన్నాళ్ళకు అసలు పెళ్ళి మాట అటకెక్కుతుందేమో అనేంతలా ట్రెండ్ మారిపోతోంది. కత్రినా చాన్నాళ్ళు సల్మాన్ ఖాన్ తో చట్టాపట్టాలేసుకు తిరిగింది, ఇటు రణబీర్ కపూర్ కూడా దీపికతో, సోనమ్ తో కొన్నాళ్ళు ఫ్రెండ్ షిప్ చేశాడు. ఇప్పుడు వీరిద్దరూ ఒక్కటయ్యారు. చాలా తేలికగా ఏ భావోద్వేగాలూ లేకుండా ఇలా ఎవరితో ఎవరు జత కడుతున్నారో తెలియకుండా ఉంది. ఈ మధ్య ఇలాంటి జంటల విషయంలో తల్లిదండ్రులు కూడా చాలా లైట్ తీసుకుంటున్నారు. రిషికపూర్ వీరిద్దరి పెళ్ళికీ అంగీకరించాడు కూడా. కానీ ఈ ప్రేమ బంధానికి పెళ్ళిముడితో ఎందుకు ముగింపు చెప్పడంలేదో అర్థం కాదు. ఇద్దరూ ఆ ‘ఆ ఒక్కటీ అడగొద్దు’ అనేస్తున్నారట అడిగిన ప్రతి వారితోనూ. అందరూ ప్రశ్నలతో వేధిస్తుంటే... విసుగెత్తిన రణబీర్ కపూర్ పెళ్ళి వ్యవహారంపై ఊహాగానాలు మానుకొమ్మంటూ మీడియాను అభ్యర్థించాడట. ‘‘నేను ప్రేమలో ఉన్న మాట నిజమే. కానీ, ఇప్పుడప్పుడే పెళ్ళి ఆలోచనలు మాత్రం లేదు’’ అని ఖచ్చితంగా చెప్పాడట. అంతే కాదు తన పెళ్ళి ఆరేళ్ళ క్రితమే నిశ్చయించుకున్నాడట. ఆ తేదీ తానే ప్రకటిస్తానని కూడా చెప్పుకున్నాడు. ఈ ప్రేమలేంటో బాధ్యత లేకుండా ప్రవర్తించడాలేంటో ఈ వ్యవహారం చూస్తుంటే... పెళ్ళి పిలుపులు ఎక్కువగా లేకుండా గుట్టుగా పెళ్ళి చేసుకుని, గౌరవంగా జీవిస్తున్న ఐశ్వర్యనే నయమనిపిస్తుంది. కత్రినా, రణబీర్ ల పెళ్ళికి అడ్డేమిటో?