ఆమెకి 30 ఏళ్లు ప‌ట్టింది

April 02, 2015 | 04:50 PM | 53 Views
ప్రింట్ కామెంట్
rathi_agnihotri_niharonline

కెరీర్ ఊపుమీద ఉండ‌గానే కొంద‌రు నాయిక‌లు డ‌బ్బును, ఫేమ్‌ను కాద‌నుకుని పెళ్లి చేసుకుంటారు. అలాంటివారిలో ర‌తి అగ్నిహోత్రి ఒక‌రు. ఏక్ దుజే కేలియే సినిమా ద్వారా అంద‌రికీ సుప‌రిచితులే. ఆ త‌ర్వాత ప‌లు సినిమాల్లో న‌టించిన ఆమె ఆ మ‌ధ్య త‌న భ‌ర్త అనిల్ విర్వానీ త‌న‌ను మాన‌సిక క్షోభ‌కు గురిచేస్తున్నాడంటూ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దాని గురించి ఆమె మాట్లాడుతూ ``అనిల్ న‌న్ను పెట్టిన హింస ఎలాంటిదో మా అబ్బాయికి బాగా తెలుసు. నాకోసం కాద‌మ్మా, నీ కోసం నువ్వు బ‌తుకు అని వాడు చెప్పిన మాట‌లే నాలో ధైర్యాన్ని నింపాయి. పోలీసుల‌కు ఫిర్యాదు చేసేలా ప్రోత్స‌హించాయి. ఈ ప‌ని చేయ‌డానికి నాకు 30 ఏళ్లు ప‌ట్టింది`` అని చెప్పుకొచ్చిందీమె.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ