అవునా? వాళిద్దరికి అఫైర్ ఉందా!

April 01, 2015 | 12:08 PM | 126 Views
ప్రింట్ కామెంట్
ravi_babu_poorna_affair_niharonline

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు, డైరక్టర్ల మధ్య రిలేషన్ షిప్ గురించి గాసిప్స్ రావటం కొత్తేమీ కాదు. ఆ మధ్య పూరి, ఛార్మీలకు అఫైర్ మీడియా ఓపెన్ గానే కూసింది. దీనిపై పూరి కూడా అలాంటిదేమీ లేదని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తాజాగా దర్శకుడు రవిబాబు, హీరోయిన్ పూర్ణ మధ్య అఫైర్ ఉందంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై రవిబాబు ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు. ‘‘షూటింగ్ పూర్తయ్యాక నా సినిమాలోని నటీనటులతో, టెక్నికల్ టీమ్ తో నేను మాట్లాడను. మూడు సినిమాల్లో కలిసి చేసినంత మాత్రాన పూర్ణతో నాకు ఏదో అఫైర్ ఉందనుకోవడం తప్పు. నిజంగా అలాంటి అఫైర్ ఉంటే మరలా నాతో సినిమాలు చేయడానికి హీరోయినేల ముందుకు రారు కదా’’ అని అంటున్నారు రవిబాబు. ఆయన తెరకెక్కించిన అవును2 ఈ నెల 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో పూర్ణ పాత్ర హైలైట్ అవుతుందని, అవును సినిమాకు సీక్వెల్ అనడం కన్నా, అవును పార్ట్ 2 అనడం బావుంటుందని ఆయన అభిప్రాయ పడ్డారు. తనకు ఏ హీరోయిన్లతోనూ లింకులు లేవని ఆయన స్పష్టం చేశారు. సినిమా పూర్తయిన తర్వాత హీరోయిన్లతో అసలు ఫోన్లలో కూడా మాట్లాడనని ఆయన చెప్పారు . 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ