డబల్ కిక్ ఇవ్వాలంటే ఈ మాత్రం శ్రమించాలి

February 10, 2015 | 01:09 PM | 25 Views
ప్రింట్ కామెంట్
ravitheja_kick_2_niharonline

మాస్ మహరాజా రవితేజ త్వరలో కిక్-2 చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రవితేజా ఆడియన్స్ కు డబుల్ కిక్ ఇచ్చే రేంజ్ లో నటించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల వచ్చిన ఐ సినిమాలో విక్రమ్ చేసిన సాహసం వంద కేజీలు పెరగడం, మళ్ళీ 50 కేజీలకు తగ్గడం వంటి ట్రెండ్ ను తను కూడా కొంచెం ఫాలో అయిపోతున్నాడు. ఈ చిత్రంలో తండ్రీ కొడుకులుగా డ్యుయెల్ రోల్ లో నటిస్తున్నాడు రవి తేజ. దీని కోసం కొడుకుగా యంగ్ గా కనిపించడానికి దాదాపు 6 కేజీల బరువు తగ్గుతున్నాడట. అందుకోసం ఆహారంలో చాలా మార్పులు చేసుకోవడమే కాకుండా కఠినమైన ఎక్సర్ సైజ్ కూడా చేస్తున్నానని రవి తేజా చెప్పాడట. అయితే ఈ మధ్య పలు ప్రెస్ మీట్లలో కనిపించిన రవితేజ మరీ సన్నబడి కనిపించడంతో కొందరు భయపడిపోయారట. ఎందుకంటే ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు అలా కనిపిస్తున్నాయి కాబట్టి. అయితే ఎలాంటి ఆందోళన అవసరం లేదని, సినిమా పాత్రకు ఇలా సన్నబడాల్సి వచ్చిందని చెబుతున్నారు యూనిట్ సభ్యులు. అయితే రవి తేజా డబుల్ కిక్ తో ప్రేక్షకులకు బాగా కిక్ ఇవ్వబోతున్నాడన్నమాట.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ