‘ఓ మై ఫ్రెండ్’ ఫేమ్ వేణు శ్రీ రామ్ దర్శకత్వంలో రవితేజ హీరోగా దిల్ రాజు నిర్మాతగా కొత్త చిత్రం టాక్స్ లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాను రవితేజ బెంగాల్ టైగర్ ముగించకుండానే ముహూర్తం పెట్టేశారు. గురువారం హైదరాబాద్‌లోని దిల్ రాజు కార్యాలయంలో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. రవితేజపై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి దర్శకుడు హరీష్ శంకర్ .ఎస్ కెమెరా స్విచ్చాన్ చేయగా, సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ క్లాప్ కొట్టారు. దర్శకుడు సుకుమార్ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. సుకుమార్, దిల్ రాజు, వినాయక్, రవితేజ స్క్రిప్ట్ ను డైరెక్టర్ వేణు శ్రీ రామ్ కు అందించారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ..
హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘గతంలో నేను రవితేజ కలిసి చేసిన చిత్రం ‘భద్ర’. ఈ చిత్రం ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. ఆ తర్వాత మా కాంబినేషన్ లో వస్తున్న చిత్రమిదే. ఈ చిత్రం కూడా తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది. అవుటండ్ అవుట్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న ఎంటర్ టైనర్ గా సినిమా రూపొందనుంది. ‘ప్రేమమ్’ ఫేమ్ అనుపమ పరమేశ్వరన్ ఓ హీరోయిన్గా నటిస్తుంది. మరో హీరోయిన్ ఇందులో నటించనుంది. ఆమె వివరాలను త్వరలోనే తెలియజేస్తాం. అక్టోబర్ 25 నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను 2016వేసవిలో విడుదల చేసే ఆలోచనలో ఉన్నాం’’ అన్నారు.కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు చిత్రయూనిట్ కు అభినందనలు తెలియజేశారు.రవితేజ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్, అనుపమ పరమేశ్వరన్, నాజర్, రావు రమేష్ తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: రిచర్డ్ ప్రసాద్, డైలాగ్స్: రమేష్-గోపి, ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్, కో ప్రొడ్యూసర్స్: శిరీష్, లక్ష్మణ్, నిర్మాత: రాజు,కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: వేణు శ్రీ రామ్.