రవితేజ, త్రిష జంటగా 2007లో విడుదలైన సినిమా కృష్ణ. వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఈ జంట తళుక్కున మెరిశారు. ఇప్పుడు ఈ జంట మళ్లీ రిపీట్ కానుందా? అవుననే అంటున్నాయి సినిమా వర్గాలు. దానికి తోడు త్రిష తన పెళ్లి తర్వాత కూడా నటిస్తానని ఈ మధ్య స్టేట్ మెంట్ కూడా ఇచ్చేసింది. దాంతో రవితేజ పక్కన త్రిష తప్పక జోడీ కడుతుందనే వార్తలు ఊపందుకున్నాయి. అక్షయ్ కుమార్, కాజల్, అనుపమ్ ఖేర్ కీలక పాత్రల్లో నటించిన స్పెషల్ 26 ఆ సినిమా దర్శకుడు నీరజ్ పాండేకు గొప్ప పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమా హక్కులు ప్రస్తుతం త్యాగరాజన్ చేతిలో ఉన్నాయి. ప్రశాంత్ తండ్రి ఈ తరం వారికి సుపరిచితుడైన త్యాగరాజన్ ఈ సినిమాను నాలుగు భాషల్లో తెరకెక్కించాలని ఆలోచిస్తున్నారట. కాగా తెలుగులో రవితేజ, త్రిష జంటను రిపీట్ చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయట. సో దాదాపు ఏడేళ్ల తర్వాత రవితేజ, త్రిష జోడీ రిపీటు కానుందని ఫిల్మ్ నగర్ టాక్. కాకపోతే అనుపమ్ ఖేర్ నటించిన పాత్రలో ఎవరు నటిస్తారనే విషయం మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.