అంటే ఆయన తెలుగు పాటకు సంగీతం సమకూర్చడం లేదు... ఆయన ఓ తెలుగు పాట పడేస్తున్నారు... తెలుగులో ఇంతకు ముందు పాడినా, ఆయన మరోసారి తెలుగులో గొంతు సవరించుకున్నారు. ధనుష్ హీరోగా తెలుగులోకి వస్తున్న ‘మరియన్’ సినిమా కోసం తెలుగులో పాట పాడారు. గీత రచయిత చంద్రబోస్ రాసిన ‘మనసా పదా...’ అనే ఈ తెలుగు పాటను లాస్ ఏంజెల్స్ లో పాడి, రికార్డు చేశారు. అయితే తమిళంలో ఈ పాటను ఆయనే పాడారట. ఈ చిత్రాన్ని తెలుగులోకి ఎస్.వి.ఆర్. మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అధినేత శోభారాణి విడుదల చేస్తున్నారు. నిజానికి, మొదట ఈ తెలుగు పాట పాడడానికి రెహమాన్ సంకోచించారట. కానీ, చివరకు పాట సందర్భం నచ్చి, పాడారట. రెహమాన్ గళం నుంచి మరో తెలుగు పాట వినే అద్రుష్టం మన తెలుగు వారికి కలిగిందన్న మాట.