మనసులోని మాటలను చెప్పుకోవడానికి సెలబ్రిటీలకు ట్విట్టర్ మంచి వేదికగా మారింది. ఈ వేదిక నుంచే రేణుదేశాయ్ అప్పుడప్పుడూ తన మనసులోని మాటలను చెప్పుకుంటూ వస్తోంది. తాజాగా ఆమె రాసుకున్న మాటలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. పవన్ కల్యాణ్ ని ఉద్దేశించి రేణుదేశాయ్ అలా ఎందుకు అన్నారా? అని ఆలోచిస్తున్నారు. మగవాళ్లకు పిల్లలున్నా పునర్వివాహానికి అది పెద్ద అడ్డంకి కాదు. కానీ స్త్రీకి పిల్లలుంటే పునర్వివాహం గురించి ఆలోచించకూడదు. పిల్లలున్న స్త్రీ తన భావోద్వేగాలన్నిటినీ అణిచి పెట్టుకోవాల్సిందే అని ఆమె చేసి ట్వీట్ తాజాగా టాక్ ఆఫ్ ద టౌన్ అవుతోంది. పవన్ చెవిన ఈ మాటలు పడ్డాయో లేదో మరి!