పవన్ స్పీచ్ పై వర్మ విసుర్లు

July 08, 2015 | 01:00 PM | 1 Views
ప్రింట్ కామెంట్
RGV_tweets_Pawan_niharonline

పవన్ ఎందుకిలా చేశారో తెలియదు గానీ, అభిమానులు చాలా నీరసపడిపోయారు. ఇక్కడ ఆయన నొప్పించక తానొవ్వక అనే లాజిక్ ఉపయోగించినట్టున్నారు. కానీ తన ముక్కుసూటి ధోరణి ఎక్కడికి పోయినట్టు. ఆయన ప్రెస్ మీట్ కు అర్థం పరమార్థం ఏమీ కనిపించకుండా పోయింది... ఇది ఈ ముక్కుసూటి డైరెక్టర్ రాంగోపాల్ వర్మ కు నచ్చనట్టుంది ట్విట్టర్ లో తన అభిప్రాయాలను వెల్లడించాడు. ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్, సెక్షన్ 8 అంశాలపై పవన్ కళ్యాణ్ సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించి.. తన స్పందనను తెలియజేసిన విషయం తెల్సిందే. దీనిపై టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. తాజాగా రాంగోపాల్ వర్మ కూడా పవన్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశారు.  సింహంలా గర్జించాల్సిన పవన్ కల్యాణ్... పిల్లిలా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. ట్విట్టర్ వేదికగా మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ఓటుకు నోటు కేసుపై పవన్ కల్యాణ్ ప్రసంగం వీడియో ఇప్పుడే చూశాను. పవన్ ఓ గర్జించే సింహం. సింహం ఆలోచించి గర్జిస్తే ఆ గర్జనలకు అర్థంలేదు. పవన్ ప్రసంగంలో నాకు అనిపించింది ఇదే. ఈ విషయం పవన్‌కు బాగా తెలుసనుకుంటా. సింహం తెలుసుకోవాల్సింది... సింహం, సింహంలా ఉండాలని. తన గర్జనలోని అంతరార్థాన్ని కుక్కలకు వివరించకూడదు. సింహం జూలో ఉందనే భ్రమలో ఉన్నాయి కుక్కలు.  కానీ కుక్కలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.. సింహం తలచుకుంటే ఎప్పుడైనా దాడి చేయగలదు. సింహం గర్జనలోని అర్థాన్ని వెతకటం కుక్కల మొరుగుల్లో లాజిక్ వెతకటం లాంటిదే. సింహం ఆలోచించదు. కుక్కలు ఆలోచిస్తాయి. కానీ ఇక్కడ ప్రాబ్లెం ఏంటంటే, గర్జించే సింహం మేకలా మాట్లాడుతోంది. సారీ పిల్లిలాగా మాట్లాడుతోంది. సింహంలాంటి పవన్ కల్యాణ్‌కు నా సలహా.. దయచేసి పిల్లిలా ఉండొద్దు. పులిలా గర్జించాలని మీ అభిమానులు కోరుకుంటున్నారు. మేకకి, మొక్కకు తేడా తెలియని సింహం, సింహమే కాదు' అంటూ రాంగోపాల్ వర్మ ఘాటైన వ్యాఖ్యలతో ట్వీట్ చేశారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ