రోబో-2గా మిస్టర్ ఫర్ ఫెక్ట్?

November 15, 2014 | 12:42 PM | 292 Views
ప్రింట్ కామెంట్

రోబో భారతీయ చలన చిత్ర విలువలు అంతర్జాతీయ స్థాయికి ఎదిగాయని ప్రపంచానికి చాటిన చిత్రం. శంకర్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబోలో వచ్చిన ఈ అద్భుతం కలెక్షన్ల వర్షం కురిపించింది. దీనికి కొనసాగింపుగా త్వరలో రోబో-2 చిత్రం ఉండబోతుందని శంకర్ ప్రకటించాడు కూడా. అయితే ఈ చిత్రం కోసం శంకర్ తనను సంప్రదించలేదని రజనీకాంత్ చెప్పడంతో ఇప్పుడీ చిత్రంలో హీరో ఎవరా? అనే ప్రశ్న తలెత్తింది. దీనికి బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందటా. కథ నచ్చడంతో రోబో-2 చిత్రంలో నటించేందుకు అమీర్ ఖాన్ ఆసక్తి చూపుతున్నాడని సమాచారం. ఇందుకు సంబంధించిన విషయాలు మరో రెండు మూడు రోజుల్లో అధికారికంగా వెల్లడికానుంది. అయితే రోబో కథ తోలుత షారూఖ్ ఖాన్ చేతి నుండే రజనీకాంత్ కు వెళ్లింది. ఇప్పుడు ఈ ప్రాజెక్టైన అమీర్ చేస్తాడా లేదా మరేయితర సౌత్ హీరో అయిన తన్నుకుపోతాడా ? వెయిట్ అండ్ సీ...

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ