అనుష్క నటించిన రుద్రమదేవి ఆడియో వరంగల్‌లో ఆదివారం విడుదలైంది. ఆడియో సీడీలను అల్లుఅర్జున్, అనుష్క విడుదల చేసి తొలి సీడీని కొండా సురేఖ, కొండా మురళిలకు అందజేశారు. కొండా సురేఖ మాట్లాడుతూ ‘‘ పోరాటాలకు మారుపేరైన రుద్రమదేవి చరిత్రను సినిమాగా తెరకెక్కించిన గుణశేఖర్ గారిని అభినందిస్తున్నాను. సినిమాని 2డి, 3డి టెక్నాలజీలో విడుదల చేస్తున్నారు. నేను సినిమా చూసి చాలా కాలమైంది. ఈ సినిమాని చూడాలనుకుంటున్నాను’’ అన్నారు. తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ ‘‘సినిమా ఇండస్ట్రీకి పూర్తి సహకారం అందిస్తుందని తెలియజేస్తున్నాను. ఈ సినిమా యూనిట్ కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి మాట్లాడుతూ ‘‘తెలుగుజాతిని ఏకచత్రాధిపత్యంగా పరిపాలించిన రుద్రమదేవి చరిత్ర మన హృదయాలనుండి చెరగలేదు. ఎప్పుడో స్కూల్ రోజుల్లో చదువుకున్న రుద్రమదేవి కథను సినిమా తెరకెక్కించాలని కళ కన్న దార్శనికుడు, దర్శకుడు గుణశేఖర్ ను అభినందిస్తున్నాను’’ అన్నారు.
ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ ‘‘గుణశేఖర్, దిల్ రాజు, కృష్ణంరాజు, అనుష్క సహా టీమ్ ను అభినందిస్తున్నాను’’ అన్నారు.
రెబల్ స్టార్ కృష్ణంరాజు మాట్లాడుతూ ‘‘అనుష్క చాలా బాగా నటించింది. గోనగాన్నారెడ్డి పాత్రను 30 ఏళ్ల క్రితం సినిమాగా తీయాలనుకున్నాను. ఇప్పుడు గుణశేఖర్ ఆ రోల్ ను ఈ సినిమాలో చూపించాడు. యూనిట్ కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు. దర్శకుడు గుణశేఖర్ మాట్లాడుతూ ‘‘నేను ఎనిమిదవ తరగతి నాన్ డిటెయిల్ లో రుద్రమదేవి చరిత్రను చదివి ఇనస్ఫైర్ అయ్యాను. నేను 9 ఏళ్లుగా ఈ సినిమాని తెరకెక్కించాలని ట్రై చేస్తున్నన్నాను. అవతార్ సినిమా చూసి స్టీరియోస్కోపిక్ త్రీడీలో చూపించాలని నిర్ణయించుకున్నాను. ఇది మన తెలుగు వాళ్ల కథ. ప్రపంచంలోని తెలుగువాళ్ల కథ. మార్కోపోలో అనే ఇటాలియన్ టూరిస్ట్ కాకతీయుల గురించి, రుద్రమదేవి పరిపాలన గురించి ప్రస్తావించాడు. అంత ఉత్తేజమైన కథ. ఝాన్సీ రాణి, ఎలిజిబెత్ గురించి తెలిసిన మనకు రాణి రుద్రమదేవి గురించి తెలియదు. తెలియజేసే ప్రయత్నమే నాది. 70 కోట్ల బడ్జెట్ తో రుద్రమదేవి సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది. తెలుగువాళ్ల రాణి అని మనం గర్వించేలా ఉంటుంది. నాతో పాటు గుణా టీమ్ వర్క్స్ కలిసి పనిచేశారు. అల్లుఅర్జున్ గోనగన్నారెడ్డి పాత్రను నేను చేస్తానంటూ ముందుకు వచ్చారు. గొప్ప సినిమా ప్రేమికుడు కాబట్టే ఈ పాత్ర చేయడానికి ముందుకు వచ్చాడు. అందు అల్లుఅర్జున్ కి రుణపడ్డాం. అనుష్క ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేసింది. రాణి రుద్రమ ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఇప్పుడు చూస్తుంటే అనుష్కలా ఉంటుందనిపిస్తుంది. జోదా అక్బర్ కథ కంటే రాణి రుద్రమదేవి సినిమా చేయడం నా అదృష్టమని నీతాలూల్లా అన్నారంటే ఆమె ఎంత ఇన్ స్ఫైర్ అయ్యారో తెలుస్తుంది. రుద్రమదేవి అనే సినిమాని నిర్మించడానికి మేమందరం కూళీల్లాగా పనిచేశాం. బన్ని క్యారెక్టర్ కోసం చాలా కష్టపడ్డాడు. మాస్ యాంగిల్, యూత్ ఫుల్ గా కనపడతాడు’’ అన్నారు. అనుష్క మాట్లాడుతూ ‘‘షూటింగ్ చేస్తున్నప్పుడు ఇది నా పుట్టిన ఊరులా మారిపోయింది’’ అన్నారు. దిల్ రాజు మాట్లాడుతూ ‘‘అనుష్కను అరుంధతిలో ఎలా చూస్తారో ఈ సినిమాలో అంతకంటే ఎక్కువగా, బాగా కనపడుతుంది. రుద్రమదేవి కథ వినగానే చాలా ఎగ్జైట్ అయ్యాను. ఈ సినిమాలో బన్ని గోనగన్నారెడ్డి పాత్ర చేయడానికి ఒప్పుకున్నాడని తెలిసింది. చాలా హ్యాపీగా అనిపించింది. గుణశేఖర్, బన్ని, అనుష్క కారణంగా సినిమా పెద్ద రేంజ్ లో తెరకెక్కింది. బన్ని ఎంట్రీతో సినిమా రేంజ్ మారిపోయింది’’ అన్నారు. స్టైలిస్ స్టార్ అల్లుఅర్జున్ మాట్లాడుతూ ‘‘అనుష్కనే ఈ సినిమాకి హీరో. అనుష్క కాబట్టి ఈ సినిమా అయింది. తన వల్లే ఈ సినిమా పూర్తయింది. వేరేవరితో ఈ సినిమా పూర్తి కాదు. కృష్ణంరాజు, రానా సహా పెద్ద పెద్ద ఆర్టిస్టులు, గొప్ప టెక్నిషియన్స్ పనిచేశారు. ఈ సినిమాలో నేను ఒక భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా చేస్తానన్నప్పుడు నన్ను ఎంకరేజ్ చేసిన త్రివిక్రమ్ గారికి థాంక్స్. ఈ సినిమా చేయడానికి ప్రథమ కారణం నాకు తెలుగు సినిమా అంటే ప్రాణం. నా వల్ల తెలుగు సినిమా ఒక మెట్టు ఎక్కుతుందంటే, నాకు అంత కంటే అదృష్టం ఇంకోటి లేదు. తెలుగు సినిమా మెట్టు ఎక్కితే గర్వపడతాను. మరో కారణం నాకు ఆడవాళ్లంటే కారణం. ఇలాంటి లేడీ ఓరియెంటెడ్ హిస్టారికల్ మూవీ చేయడానికి ఏ ప్రొడ్యూసర్ ముందుకు రాడు. కానీ గుణశేఖర్ గారే నిర్మించారు. ఇవాళ సినిమా సెకండ్ అంటూ డబ్బే ఫస్ట్ అంటున్నారు. కానీ గుణశేఖర్ గారికి మాత్రం సినిమాయే ఫస్ట్. ఎప్పుడూ సినిమా కోసమే నిలిచారు. సినిమాపై ప్యాషన్ ఉన్న దర్శకుడు. అంతటి ఫ్యాషనేట్ డైరెక్టర్ ఇక్కడ ఉన్నందుకు నేను గర్విస్తున్నాను. ఈ సినిమా ఆయన కోసమే విజయం సాధించాలి. మనం ఎక్కడి నుండి వచ్చాం. ఎవరి వల్ల వచ్చాం. మనం ఎక్కడికి వెళ్లినా ఆ హిస్టరీని మరిచిపోకూడదు. నాకు ఓ హిస్టరీ ఉంది. ఆ హిస్టరీ పేరు మెగాస్టార్ చిరంజీవిగారు. ఆయన ఎండలో కష్టపడితే ఆయన నీడ నుండి మేం పైకొచ్చాం. నాకు ఎవరైనా చిరంజీవిగారి తర్వాతే. ఎవరినైనా హర్ట్ చేయడం చాలా ఈజీ, వాళ్ల హార్ట్ లోకి వెళ్లడం చాలా కష్టం బన్ని అని చిరంజీవిగారు ఒకసారి నాతో అన్నారు. నన్ను ఇన్ని మెట్లు ఎక్కించిన మెగాభిమానులకు ధన్యవాదాలు’’ అన్నారు.