‘సాహసం సేయరా డింబకా’ ట్రైలర్ రిలీజ్

June 10, 2015 | 03:59 PM | 0 Views
ప్రింట్ కామెంట్
sahasam_seyara_dimbaka_trailer_niharonline

శ్రీ (ఈరోజుల్లో ఫేమ్), హమీద, సమత హీరోహీరోయిన్లుగా, హంసవాహిని టాకీస్ పతాకంపై తిరుమలశెట్టి కిరణ్ దర్శకత్వంలో ఎమ్.ఎస్.రెడ్డి నిర్మించిన హర్రర్ అండ్ కామెడీ చిత్రం ‘సాహసం సేయరా డింభకా'. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్టు ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమా ట్రైలర్ ను బుధవారం (జూన్ 10) విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఎమ్.ఎస్.రెడ్డి మాట్లాడుతూ, దర్శకుడు తిరుమలశెట్టి కిరణ్ ఓ మంచి చిత్రాన్ని తెరకెక్కించారని, మా బ్యానర్‌కి, మాకు ఈ ‘సాహసం సేయరా డింభకా' మంచి పేరు తెచ్చిపెడుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నానన్నారు. తెలుగు ప్రేక్షకులు ఇంతకుముందు వచ్చిన హర్రర్ అండ్ కామెడీ చిత్రాలని ఎలా ఆదరించారో.. అలాగే ఈ చిత్రాన్ని కూడా పెద్ద హిట్ చేయాలని కోరుతున్నానని, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయనీ, త్వరలోనే మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని అన్నారు. శ్రీ, హమీద, ఆలీ, షకలక శంకర్, పూర్ణిమ, జ్యోతి, జబర్దస్త్ అప్పారావ్, ఎఫ్.ఎమ్.బాబాయ్ మొదలగువారు నటించిన ఈ చిత్రానికి సంగీతం: శ్రీ వసంత్, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, పాటలు: కరుణాకర్ అడిగర్ల. నిర్మాత: ఎమ్.ఎస్.రెడ్డి (ఎమ్‌బిఎ.ఎల్‌ఎల్‌బి) కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తిరుమలశెట్టి కిరణ్.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ