సల్మాన్ తాగి ఉన్నాడనేది నిజం...

April 09, 2015 | 03:59 PM | 36 Views
ప్రింట్ కామెంట్
salman_Khan_case_niharonline

చాన్నాళ్ళుగా సల్మాన్ కారు యాక్సిడెంట్ కేసు కోర్టులో నడుస్తోంది. తాజాగా ఈ విచారణకు సంబంధించిన అంశం ఏమిటంటే... కారు ప్రమాదం సమయంలో ఈ కండల హీరో మద్యం మత్తులో ఉన్నాడనీ,  కారుతో ఢీ కొట్టి ఒకరి మృతికి కారణమైన కేసు విచారణ సందర్భంగా ప్రాసిక్యూషన్ మరోసారి స్పష్టం చేసింది. ఆ సమయంలో సల్మాన్ రక్తంలో మోతాదుకు మించి ఆల్కహాల్ ఉందని పేర్కొంది. 100 ఎంఎల్ రక్తంలో 62 ఎంజీల ఇథైల్ ఆల్కహాల్ ఉందని తెలిపారు. రక్త పరీక్షలో ఆల్కహాల్ నిష్పత్తిని బుధవారం కోర్టుకు విన్నవించింది. మరొక విషయం ఏమిటంటే ప్రమాదానికి ముందు సల్మాన్ ప్రయాణిస్తున్న కారులో సాంకేతిక సమస్యేదీ లేదని తెలిపారు. టైర్ పంక్చర్ కూడా జరగలేదని వాదించింది.  అయితే సల్మాన్ పై తాగాజా మరో  నేరారోపణ నమోదైంది. పోయిన సంవత్సరం సల్మాన్ బాడీగార్డ్ తనను తిట్టాడంటూ ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు.  

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ