ఎన్ని వివాదాలున్నా... హృదయాన్ని కట్టిపడేసే కొన్ని మనసు మెచ్చే పనులూ చేస్తుంటాడు సల్మాన్ ఖాన్. తన చెల్లెలి విషయంలో సల్మాన్ చాలా ఎత్తుమీదున్నట్టు అనిపిస్తాడు. కుటుంబం పట్ల కూడా చాలా ప్రేమగా ఉంటాడు. అలాగే అభిమానుల మీద కూడా అంతే ప్రేమ చూపిస్తాడు. సల్మాన్ ఖాన్ సినిమా రంగంలో నే కాదు సేవా రంగంలో కూడా ముందు ఉంటాడు. ఆయన స్థాపించిన ‘బీయింగ్ హ్యూమన్’ సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. తాజాగా ఆయన చేసిన ఊహించని సాయంతో వార్తల్లోకి ఎక్కారు అదేంటంటే ఓ గ్రామంలో టీవీలు లేని వారిని చూసి హృదయం చెలించింది ఇన్ని కోట్లు పెట్టి సినిమాలు తీస్తే ఆ సినిమాలు చూసే భాగ్యం అక్కడి వారికి లేకపోవడంతో చాలా బాధపడ్డాడు. ‘బజరంగీ భాయిజాన్’ చిత్రీకరణ కశ్మీర్‌లోని పహల్గమ్ ప్రాంతంలో జరిగింది. ఆ సమయంలో ఆ చుట్టు పక్కల ప్రజలు ఎంతో ఆసక్తిగా షూటింగ్ చూడటానికి వచ్చారు. సల్మాన్ ఖాన్ అంటే తమకెంతో ఇష్టమని కానీ ఆయన సినిమాలు చూడటానికి అక్కడ థియేటర్లు లేవని కనీసం టీవీలు కూడా తమకు లేవని చెప్పడంతో సల్లూ భాయ్ చాలా బాధపడ్డాడు వెంటనే అక్కడి ప్రజలతో మాట్లాడి టీవీలు కొనుగోలు చేసే స్తోమత లేని వారి కోసం వాటిని పంపిణీ చేయాలని నిర్ణయించుకొన్నాడు సల్మాన్. ఇప్పటికే కొంతమందికి టీవీలను అందజేశాడు కూడా. డబ్బు ఖర్చు పెట్టే విషయంలో సల్మాన్ ముందుంటాడు. సంపాదన ఉపయోగపడటానికే గానీ దాచుకోడానికి కాదు కదా! ఇలా తన డబ్బుతో ఎంతో మందిని ఆనందపెట్టే సల్లూభాయ్ అంటే అభిమానించని వారు ఎవరుంటారు?