అక్రమంగా ఆయుధాలను కలిగి ఉండటంతోపాటు పర్యావరణ చట్టానికి వ్యతిరేకంగా కృష్ణ జింకలను వెంటాడిన కేసులో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ భవిష్యత్ ఏంటో బుధవారం తేలనుంది. పదహారేళ్లుగా కొనసాగుతున్న ఈ కేసులో తుది తీర్పును జోధ్ పూర్ కోర్టు నేడు వెలువరించనుంది. అక్టోబర్, 1998 లో హమ్ సాథ్ సాథ్ హై చిత్ర షూటింగ్ సందర్భంగా తన తొటి నటులతో కలిసి సల్మాన్ వేటకు వెళ్లాడు. అక్కడ మూడు చింకారాలు, ఒక కృష్ణ జింకను వెంటాడి చంపినట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆయుధాల చట్టం కింద అక్కడి అటవీ శాఖ సల్లూభాయ్ పై కేసు నమోదు చేసింది. ఈ కేసులో గనుక సల్మాన్ దోషిగా తేలితే మూడు నుంచి ఏడేళ్ల దాకా శిక్ష పడే అవకాశం ఉంది. అంతేకాదు బెయల్ కూడా వెంటనే దొరకపోవచ్చునని సమాచారం.