సల్మాన్ కు రాంచరణ్ వాయిస్...!

October 20, 2015 | 04:07 PM | 4 Views
ప్రింట్ కామెంట్
salman-khan-ram-charan-rajasri-movie-niharonline

మెగా పవర్ స్టార్ బాలీవుడ్ కండల వీరుడికి వాయిస్ ఇవ్వడమేంటి? అంటే హిందీ డైలాగ్స్ చెప్తాడా రాంచరణ్ అనిపిస్తోంది కదా... కానీ అది కాదు ఇక్కడ మ్యాటర్... సల్మానే తెలుగు మాట్లాడేస్తాడు... అర్థమైంది కదా... సల్మాన్ ఖాన్ సినిమాకు రాంచరణ్ డబ్బింగ్ చెపుతాడన్నమాట. గతంలో వచ్చిన రాజశ్రీ ప్రొడక్షన్ సినిమాలన్నీ తెలుగులో సూపర్ హిట్ అయ్యాయి. ప్రేమ పావురాలు, ప్రేమాలయం, ప్రేమానురాగం అన్నీ సల్మాన్ ఖాన్ సినిమాలూ తెలుగులో విడుదలయ్యాయి. ఇప్పుడు సల్మాన్ ఖాన్ హీరోగా సోనమ్ కపూర్ హీరోయిన్ గా నటించిన సినిమా ‘ప్రేమ్ రతన్ దన్ పాయో’. దీపావళి కానుకగా రిలీజ్ అవుతుంది. ఈ చిత్ర నిర్మాతలైన రాజశ్రీ ప్రొడక్షన్స్ వారు, సల్మాన్ ఖాన్ కలిసి ఈ సినిమాని తెలుగులో కూడా రిలీజ్ చెయ్యాలనుకుంటున్నారు. సల్మాన్ తన పాత్రకి తెలుగులో డబ్బింగ్ చెప్పడం కోసం రామ్ చరణ్ ని అప్రోచ్ అయ్యాడు. రామ్ చరణ్ వెంటనే సల్మాన్ ఖాన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. విడుదలకు ఎంతో సమయం లేకపోవడంతో సల్మాన్ ఖాన్ రోల్ కి డబ్బింగ్ చెప్పడం మొదలు పెడుతున్నాడు రాంచరణ్. అయితే ఈ సినిమాకు తెలుగు టైటిల్ ఇంకా ఫిక్స్ చేయలేదు. 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ