ఆత్మీయ స్పర్షతో కొత్త ఉత్సాహం

April 30, 2015 | 02:55 PM | 148 Views
ప్రింట్ కామెంట్
salman_arpitha_at_kashmir_niharonline

మనసంతా చికాకుతో ఊపిరి సలపకుండా ఉన్నప్పుడు ఒక్క ఆత్మీయ స్పర్ష ఎంతో ఊరటనిస్తుంది. అసలే సల్మాన్ కేసు ఏమవనుందోననే చికాకులో ఉన్నాడేమో ఎండాకాలంలో ఊరట నిచ్చే కాశ్మీర్ అయినా... ఆయన చికాగ్గానే ఉన్నాడట. అంత ఒత్తిడిలోనూ.... క్షణంలో హుషారుగా మొహంలో చిరునవ్వు తెచ్చుకుని లేచి నిలబడ్డాడట. కారణం ఆయనకు ఎంతో ఇష్టమైన చెల్లెలు అర్పిత అక్కడ ప్రత్యక్షమవ్వడమే... ఆయన ప్రస్తుతం షూటింగ్ కోసం కాశ్మీర్ లో ఉన్నాడు. కబీర్ ఖాన్ దర్శకత్వంలో తీస్తున్న బజ్ రంగి భైజాన్ సినిమా కాశ్మీర్ లోయలో షూటింగ్ జరుపుకుంటోంది. చుట్టూ నటీనటులు, కెమెరాలు, మైక్ సౌండ్ లతో కాస్తంత అలసి పోయిన సల్మాన్ వెంటనే చెల్లెలి రాకతో రిలీఫ్ ఫీలయ్యాడట. చెల్లెలు అర్పిత, బావ అయూష్ శర్మ అనుకోకుండా షూటింగ్ వద్దకు వచ్చారట.  చికాగ్గా ఉన్న ఆయనకు కుటుంబ సభ్యులు కనిపించడంతో ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసింది. ఈ విషయాలను అర్పిత తన సోషల్ నెట్వర్క్ లో పోస్టు చేసి సోదరుడి ఆనందం గురించి చెప్పుకొచ్చింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ