సల్లూభాయ్ తుది తీర్పు రేపే...

May 05, 2015 | 07:52 PM | 193 Views
ప్రింట్ కామెంట్
Shortcut to salman_khan_court_niharonline

సల్లూభాయ్ భవితవ్యం రేపే తేలిపోతుంది. 2002 లో జరిగిన హిట్ అండ్ రన్ కేసులో నిందితునిగా పరిగణించి విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. సల్మాన్ జైలుకు వెళతాడా లేక విదేశాలకు వెళ్లి సినిమా షూటింగ్ చేసుకుంటాడా..? అని అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన తుది తీర్పును రేపు సెషన్స్ కోర్టు వెలువరించనుంది.  పదమూడేళ్ళుగా జరుగుతున్న ఈ విచారణ పలు కోణాలు తిరుగుతూ చివరికి ప్రమాదం జరిగినపుడు తాను కారులోనే ఉన్నా కానీ డ్రైవింగ్ చేయటం లేదని..ఆ సమయంలో తన డ్రైవర్ కారును నడుపుతున్నాడని సల్మాన్‌ఖాన్ వెల్లడించిన విషయం తెలిసిందే. కారు డ్రైవర్ కూడా ఈ విషయాన్ని అంగీకరించారు. అయితే ఇప్పటికే విచారణ పూర్తైన ఈ కేసులో సల్మాన్ ఖాన్ సహా అతని డ్రైవర్ వాంగ్మూలన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో, వారు కోర్టుకు వాంగ్మూలాన్ని ఇచ్చారు. అయితే రేపు కోర్టు ఎదుట బందోబస్తును కట్టుదిట్టం చేశారు. తుది తీర్పు వెలువడనున్న నేపథ్యంలో సల్మాన్ ఖాన్ జైలుకు వెళ్తారా.. లేదా ఎప్పటిలాగే సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తారా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఓక వేళ న్యాయస్థానం శిక్ష విధిస్తే కనీసం పదేళ్ల జైలు శిక్ష పడవచ్చని న్యాయనిపుణులు అంచనా వేస్తున్నారు. 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ