ఒక పక్క డేట్లు కుదరడంలేదనో, మరే ఇతర కారణాల వల్లనో ఒప్పుకున్న సినిమాలనుంచి తప్పుకుంటున్నారు హీరోయిన్లు. కానీ హీరో, హీరోయిన్లు ఎవరైనా ముందు ఓ సినిమాకు ఒప్పుకోవాలంటే ఆ సినిమాలో వాళ్ళ పాత్ర ప్రాముఖ్యత ఏంటి? కథ ఎలాంటిది అనేది చూస్తారు. మరి సమంత ఇవేవీ చూడకుండా ఓ సినిమా ఒప్పుకుందట. ఆశ్చర్యంగా ఉంది కదా... కారణం ఆ దర్శకుడి మీద నమ్మకమంటోంది. విక్రమం హీరోగా నటిస్తున ’పత్తు ఎండ్రాదు కుళే’ అనే తమిళ సినిమాకు విజయ్ మిల్టన్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ దర్శకుడు అంతకు ముందు ‘గోలీ సోడా’ అనే ఓ బాలల చిత్రం తీశాడు. ఈ సినిమా సమంతకు బాగా నచ్చిందట. అందుకని ఆయన చేసే సినిమా అనగానే కథ గురించి గానీ, మరే ఇతర విషయాలూ అడక్కుండానే సినిమా చేయడానికి ఒప్పుకుందట. ఆయన సినిమాలో నటించే ఛాన్స్ వచ్చినందుకు చాలా సంతోష పడిపోతోందట. మరి అంతగా ప్రాధాన్యం లేని పాత్ర ఇస్తే ఏం చేస్తుంది సమంత? కానీ అలాంటిదేమీ లేకుండా ఆ దర్శకుడు ఈ సినిమాలో సమంతకు మంచి రోల్ ఇచ్చాడని అనుకుంటున్నారు.