మ్యూజిక్ డైరక్టర్ దేవీ శ్రీప్రసాద్ హీరోగా ఆరంగ్రేటం చేసే టైం దగ్గర పడింది. నాన్నకు ప్రేమతో తర్వాత ఏ హీరోతో సినిమాకు కమిట్ కానీ సుకుమార్ దేవీని హీరోగా ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడని సమాచారం. ఇప్పటికే సౌత్ లో సంగీత దర్శకుడిగా కావలసినంత క్రేజ్ తెచ్చుకున్న దేవిని, హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు అన్ని మార్గాలు సుగమం అయినట్లే. దిల్ రాజు ఈ సినిమాను నిర్మించనునున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో దేవిశ్రీకి జోడీగా ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే విషయంపై కొంతమంది కథానాయికల పేర్లను పరిశీలించారు.
చివరికి సమంతా అయితేనే దేవిశ్రీకి జోడీగా బాగా నప్పుతుందని భావించి, ఆమెతో సంప్రదింపులు మొదలుపెట్టినట్టు చెబుతున్నారు. తెలుగులో 'అ .. ఆ' .. ' బ్రహ్మోత్సవం' సినిమాల్లో సమంతా నటిస్తోంది. ఇక తమిళ్లోను వరుస సినిమాలతో ఆమె బిజీగా వుంది. అందువలన ఆమె ఈ సినిమాకి ఓకే చెబుతుందా? అనే సందేహాన్ని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ కి గల క్రేజ్ కారణంగా .. ఇది సుకుమార్ - దిల్ రాజుల సినిమా కావడం వలన ఆమె తప్పకుండా గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని మరికొంతమంది అంటున్నారు. గతంలో బెల్లకొండ శ్రీనివాస్ సినిమా కోసం భారీగా పారితోషకం తీసుకున్న సమంత ఈ ప్రాజెక్టు కోసం కూడా అదే రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకోనుందని తెలుస్తోంది.