అప్పట్లో సంపత్ నంది పవన్ కళ్యాణ్ తో ‘గబ్బర్ సింగ్-2' కు రెడీ అయ్యాడనే వార్తలు బాగా వినిపించాయి. కారణాలేవీ తెలియకుండానే ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నాడు. ఇప్పుడు ఆయన రవితేజతో ‘బెంగాల్ టైగర్' సినిమా చేస్తున్నారు. అయితే గబ్బర్ సింగ్ 2 నుంచి ఎందుకు తప్పుకున్నాడో ఇప్పుడు తన మనసు విప్పాడు. తప్పనిసరి పరిస్థితుల్లోనే తాను ఆ ప్రాజెక్టు నుండి బయటకు రావాల్సి వచ్చిందని, దీనికి ఎవరూ కారణం కాదని తెలిపారు. మీడియాలో వచ్చిన రకరకాల వార్తలను ఆయన ఖండించారు. పవన్ కళ్యాణ్ తో తన రిలేషన్ షిప్ గురించి మాట్లాడుతూ, ‘‘పవన్ కళ్యాణ్ తో ఇంకా ఫ్రెండ్షిప్ కొనసాగుతూనే ఉంది. ఆయన నాకు కేవలం ఒక ఫోన్ కాల్ దూరంలో ఉన్నారు అని తెలిపారు. త్వరలోనే పవన్ కళ్యాణ్‌తో మరో సినిమా కు ప్లాన్ చేస్తున్నట్టు కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తారు. పవన్ కళ్యాన్ కూడా ఇందుకు సిద్ధంగానే ఉన్నట్లు సంపత్ నంది చెప్పుకొచ్చారు. తనకు రచ్చ సినిమా చేసే అవకాశం కల్పించిన చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపారు. మెగా ఫ్యామిలీకి తాను ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. ప్రస్తుతం తాను రవితేజతో చేస్తున్న ‘బెంగాల్ టైగర్' స్ర్కిప్టు గతంలో పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్-2' చిత్రం కోసం రాసుకున్నదే అనే వార్తలను ఆయన ఖండించారు. రవితేజతో చేస్తున్న ‘బెంగాల్ టైగర్' స్క్రిప్టు పూర్తిగా డిఫరెంట్. రవితేజ కోసం రాసుకున్న స్క్రిప్టే అని తెలిపారు.
ఇక బెంగాల్ టైగర్ విశేషాల్లోకి వెళిగే రామోజీ ఫిల్మ్ సిటీలో కొన్ని యాక్షన్ సీన్లను ఫాంటమ్ కెమెరాతో చిత్రీకరిస్తున్నారు. మాస్ మహరాజ్ రవితేజ చిత్రం అనగానే ప్రేక్షకుల్లో అంచనాలు ఎలా వుంటాయో మా బెంగాల్ టైగర్ చిత్రం అలానే వుంటుంది. ఆయన ఎనర్జి స్క్రీన్ మీద ఎలా ఆడియన్స్ చూడాలనుకుంటారో అదే రేంజిలొ చిత్రాన్నిచేస్తున్నాం.. అన్నాడు దర్శకుడు... ఈ చిత్రానికి నిర్మాత కె కె రాధామోహన్, తమన్నా, రాశిఖన్నా హీరోయిన్లు.