దేనికైనా హద్దూ పద్దూ ఉండాలి. నెగటివ్ పబ్లిసిటీ మంచిదే. అలాగని కొన్ని విషయాలతో ఆడుకోకూడదు అని సోషల్ మీడియాలో సంపూర్ణేష్ బాబుపై అందరూ మండిపడుతున్నారు. 1947 ఆగస్టు 15న వచ్చిన స్వాతంత్ర్యాన్ని ఏప్రిల్ 15న వచ్చినట్టు, అదే రోజు సాయంత్రం కొబ్బరిమట్ట ఆడియో జరుపుతున్నట్టు సంపూర్ణేష్ బాబు పోస్టర్ హల్ చల్ చేస్తోంది. జాతీయతకు సంబంధించిన అంశాలతో పరాచకాలేంటని కొందరు మండిపడుతున్నారు. నా దృష్టిలో కుటుంబం అంటే క పాక, భార్య అంటే నచ్చి తెచ్చుకునే తవుడు, ఇక.. పిల్లలు.. మనం ఇష్టంతో కలుపుకున్న కుడితి, కానీ నా దృష్టిలో తండ్రి అంటే పాలిచ్చే మగ ఆవు. ఇలాంటి గొప్ప సెంటిమెంట్ కథా చిత్రంలో గుండె ని హత్తుకునే ఒక పాటని మీ కోసం నేను స్వయంగా పాడాను. భారత స్వాతంత్ర్యాన్ని 68 ఏళ్లుగా ఆస్వాదించిన మీరు ఈ సినిమాలోని గీతాలని ఆదరిస్తారని ఆశిస్తూ..’’ అని సంపూర్ణేష్ బాబు అందులో రాసినట్టు ఉంది. కొబ్బరిమట్ట పాటలను బుధవారం రాత్రి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో సంపూర్ణేష్ బాబు కూడా ఓ పాట పాడాడన్నది విషయం. ఏదేమైనా కొన్ని విషయాల జోలికి పోనంత వరకే అందం. తేరక దొరికింది కదా అని ప్రతి విషయాన్నీ కదిలిస్తే మాత్రం ప్రజలు ఊరక ఉండరనే విషయం సంపూర్ణేష్ బాబుకు మరో సారి అర్థమై ఉంటుంది.