ఒక్క సినిమాతో ఫ్రెండ్‌షిప్ గ‌ట్టిప‌డింది

June 26, 2015 | 05:17 PM | 2 Views
ప్రింట్ కామెంట్
Tiger_stills_close_frineds_niharonline

ఏ ప‌నినైనా కాంబినేష‌న్‌లో చేసేట‌ప్పుడు ప‌ర‌స్ప‌రం న‌మ్మ‌కం ఉండ‌ట‌మ‌న్న‌ది చాలా కీల‌కం. తాజాగా అలాంటి న‌మ్మ‌కం ఇద్ద‌రు ఫ్రెండ్స్ మ‌ధ్య జోష్‌ను రేకెత్తిస్తోంది. వారిద్ద‌రే సందీప్ కిష‌న్‌, రాహుల్ ర‌వీంద్ర‌న్‌. వీరిద్ద‌రు క‌లిసి న‌టించిన టైగ‌ర్ శుక్ర‌వారం విడుద‌లైంది. స‌ర్వ‌త్రా పాజిటివ్ రెస్పాన్స్ వ‌స్తుండ‌టంతో ఇద్ద‌రూ ఆనందంగా ఉన్నారు. ట్విట్ట‌ర్ నిండుగా త‌మ‌ను అభినందిస్తూ వ‌స్తున్న ట్వీట్ల‌కు స్పందిస్తున్నారు. ఠాగూర్ మ‌ధు తెర‌కెక్కించిన ఈ సినిమాను ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.శీర‌త్ క‌పూర్ నాయిక‌గా న‌టించింది. వార‌ణాసి బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రూపొందింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ