పవర్ స్టార్ పవన్ కళ్యాన్ షూటింగ్ సమయంలోగానీ, ఏ సినిమా ఫంక్షన్ (రేర్ గా)లకు హాజరైనా కాస్త అంటీ ముట్టనట్టుగా ఉంటారేమో అనిపిస్తుంది. తనకు నచ్చిన వారితో కలిసి సరదా సరదాగా గడిపినట్టు ఎక్కడా కనిపించదు. కానీ ఈ కనిపిస్తున్న ఫొటోను చూస్తుంటే మాత్రం పవన్ కళ్యాణే స్వయంగా సెల్ఫీ తీసినట్టు తెలిసిపోతోంది. పైగా ఇక్కడున్న బ్రహ్మజీ, అలీతో ఈయనకు కాస్త సన్నిహితత్వం ఎక్కువే. వీరితో సెల్ఫీ సర్దార్ షూటింగ్ సమయంలోనే అని తెలిసిపోతోంది. అందరూ కాకీ ప్యాంట్లు ధరించారు. ఈ ‘సర్దార్ గబ్బర్ సింగ్' షూటింగ్ శర వేగంగా జరుగుతోందని ఈ చిత్ర బృందం తెలుపుతోంది. ఇటీవలే ఈ చిత్రం కోసం లోకేషన్లు పరిశీలించేందుకు గుజరాత్ వెళ్లి వచ్చిన విషయం వార్తలో వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న షూటింగులో మధ్యలో ఈ సెల్ఫీ దిగారేమో... పవన్ కళ్యాణ్ తో దిగిన ఈ సెల్ఫీని బ్రహ్మాజీ పోస్టు చేశాడు. సర్దార్ షూటింగ్ ఇక్కడ త్వరత్వరగా ముగించుకుని తరువాతి షెడ్యూల్ కోసం టీం అంతా కలిసి గుజరాత్ వెళ్లనున్నట్టు ఈ చిత్రం టీం తెలుపుతోంది.