స్కార్లెట్ చెప్పిన సిగ్గు ముచ్చట...?

April 11, 2015 | 03:04 PM | 14 Views
ప్రింట్ కామెంట్
scarlett_wilson_hot_niharonline

ఈ మధ్య కాలంలో ఐటమ్ సాంగ్స్ హీరోయిన్లు కూడా చేస్తున్పటికీ ఒక్కోసారి తప్పదన్నట్టు ఐటమ్స్ గర్ల్స్ తో ఓ పాట పెట్టేస్తున్నారు. పవన్ కళ్యాణ్ నటించిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రంలో ‘జరమొచ్చింది...’ అంటూ ఓ ఐటెం సాంగ్ ఇరగదీసి భామ స్కార్లెట్ విల్సన్. అయితే ఈ అమ్మడు ప్రభాస్ గురించి చెపుతూ అతనికి చాలా సిగ్గని తేల్చేసింది.  ఇంతకీ విషయమేంటంటే. ప్రభాస్ నటించిన ‘బాహుబలి’ చిత్రంలో ప్రభాస్ తో పాటు స్కార్లెట్ విల్సన్, నోరా ఫతేహి, స్నేహా ఉపాధ్యాయలతో ఒక హాట్ హాట్ ఐటెం సాంగ్ ను పెట్టారట ఈ షూటింగ్ సమయంలో ప్రభాస్ ను స్కార్లెట్ బాగా గమనించిందట. అందుకే ప్రభాస్ తో మాట్లాడటానికే తనకు 3 రోజుల సమయం పట్టిందంటోంది. ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడడని చెప్పింది. చాలా భోళామనిషి అని కూడా అంటోంది. ఈ సాంగ్ చేయడానికి ఎనిమిది రోజుల సమయం పట్టిందని చెపుతోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ