మంచి ఉద్దేశంతో టాప్ లెస్ గా కస్తూరి

October 30, 2015 | 03:50 PM | 1 Views
ప్రింట్ కామెంట్
Kasthuri-promotes-Breastfeeding-in-Public-niharonline

హీరోయిన్ కస్తూరి గుర్తుందా....? అన్నమయ్య, సోగ్గాడి పెళ్ళాం, మా ఆయన బంగారం. నిప్పురవ్వ వంటి సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. అన్ని సినిమాల్లోనూ చాలా సంప్రదాయ దుస్తుల్లో డిగ్నిటీగా కనిపించే ఈ హీరోయిన్ టాప్ లెస్ గా పోజులిచ్చిందట... నమ్ముతారా? నమ్మాలి మరి... తనో మంచి ఉద్దేశంతో పోజులిచ్చిందట. అది కూడా తనంతట తానుగా ఈ నిర్ణయం తీసుకుందట. ఇవి కుర్రాళ్ళని కవ్వించే ఫొటోలు కాదు...  మాతృత్వం గొప్పదనాన్ని చాటేందుకు ఓ ఇంటర్నేషనల్ మ్యాగజైన్ స్పెషల్ ఎడిషన్ తీసుకురాగా, దాని కోసం తన సొంత బిడ్డను ఎత్తుకుని టాప్ లెస్ గా పోజులిచ్చింది కస్తూరి. ‘ఎ బ్యూటిఫుల్ బాడీ ప్రాజెక్ట్: ఎ బాడీ ఆఫ్ మదర్స్’ పేరుతో ఈ ఫొటో బుక్ ను తీసుకొచ్చారు.

జేడ్ బీల్ అనే ప్రముఖ ఇంటర్నేషనల్ ఫొటోగ్రాఫర్ దాదాపు 80 మంది మహిళలతో ఫొటోలు తీశాడు. దాదాపుగా అన్నీ న్యూడ్ సెమీ న్యూడ్ ఫొటోలే. ప్రెగ్నెన్సీతో - బిడ్డతో ఉన్న ఈ ఫొటోలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యాయి. దీని కోసం కస్తూరి స్వచ్ఛందంగా ముందుకొచ్చి బిడ్డతో కలిసి టాప్ లెస్ గా పోజులిచ్చింది. 90ల్లో హీరోయిన్ గా తమిళ - తెలుగు భాషల్లో ఎన్నో సినిమాలు చేసిన కస్తూరి.. అమెరికాకు చెందిన రవికుమార్ అనే డాక్టర్ ను పెళ్లాడి సెటిలైంది. ఆమెకు శోభిని - సంకల్ప్ అనే ఇద్దరు పిల్లలున్నారు. ఈ మధ్య సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి కొన్ని సపోర్టింగ్ రోల్స్ కూడా చేసింది కస్తూరి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ