మారుతి దర్శకత్వంలో తయారైన ‘భలే భలే మగాడివోయ్’ చిత్రం పోస్టర్లు కొన్ని హాట్ హాట్ గా కనిపించినా... ఈ చిత్రానికి ఈ రోజే సెన్సార్ వారు ‘యు’ సర్టిఫికెట్ జారీ చేశారు. ఇంతకుముందు మారుతీ తీసిన సినిమాలన్నీ కుటుంబమంతా కలిసి సరదా సరదాగా చూసే సినిమాలే తీశారు. యాజ్ యూజువల్ గా ఈ సినిమాను కూడా చిన్న బడ్జెట్ తో సూపర్ క్వాలిటీ ఉండేలా తీశారట మారుతి. ఇక ఇందులో నటించిన నాని-లావణ్య త్రిపాఠిలు ఇప్పటికే తమ టాలెంట్ ఏమిటో నిరూపించుకున్న వారు. నాని అయితే మన తెలుగువారి అభిమాన కుటుంబ కథా చిత్రాల హీరో అయిపోయారు. మన పక్కింటి అబ్బాయే అన్నట్టుగా ఫీలవుతున్నారు ప్రేక్షకులు. అన్ని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫైనల్ కాపీ రెడీ అయ్యింది. సెన్సార్ వారు ఈ సినిమాకి ఎలాంటి కట్స్ చెప్పకుండా ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూడదగిన సినిమా అని క్లీన్ ‘యు’ ఇచ్చారని ఈ చిత్ర టీం తెలిపింది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమా చివర్లో మనల్ని థ్రిల్ చేసే అంశం కూడా ఉండనుండడం విశేషం. సెప్టెంబర్ 4న ఈ సినిమా గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. యంగ్ హీరో నాని ఈ సినిమాలో మతిమరుపు రాజాగా కనిపించి టైటిల్స్ నుంచి ఎండ్ కార్డ్ పడేంత వరకూ ప్రేక్షకులకు కడుపుప్ప నవ్విస్తాడట.