బాలీవుడ్ లో సక్సెస్ కోసం ఇఫ్పుడు బయోపిక్ మంత్రాన్ని జపిస్తున్నారు. గతంలో వచ్చిన భాగ్ మిల్కా భాగ్, మేరీకోమ్ చిత్రాలు భాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించటంతో ఇప్పుడు వరుసబెట్టి జీవితకథలను తెరకెక్కించేందుకు దర్శకులు సిద్ధమైపోతున్నారు. దాదాపు ఓ పది మంది జీవితగాథలు ఈ యేడాది తెరకెక్కున్నట్లు సమాచారం. ఇందులో సినీ ఇండస్ట్రీ కి చెందిన వారి జీవిత ఇతివ్రుత్తాల ఆధారంగా కూడా తెరకెక్కించటం విశేషం. ఈ బయోపిక్ లలో రణ్ బీర్ కపూర్ ఏకంగా మూడు చిత్రాలలో నటిస్తున్నాడు. బాలీవుడ్ లెజెండ్ గాయకుడు కిషోర్ కుమార్ జీవితాంశం. జైలు పాలయిన ప్రముఖ నటుడు సంజయ్ దత్. రైట్ బ్రదర్స్ కంటే ముందే విమానాన్ని కనుగొన్న భారతీయుడు శివకర్ బాపూజీ తల్పడే బయోపిక్ లలో రణ్ బీర్ నటించనున్నాడు. ధ్యాన్ చంద్ జీవిత గాథపై తెరకెక్కుతున్న చిత్రంలో బాలీవుడ్ బాద్షా షారూఖ్ నటించనున్నట్లు సమాచారం. కానీ, ఇప్పటికే చెక్ దే ఇండియాలో హాకీ కోచ్ పాత్రలో అలరించి ఉండటంతో ఇది ఇంకా కన్మ్ ఫార్మ్ కాలేదట. ఇక మరో ఇద్దరు క్రికెట్ క్రీడాకారుల జీవిత కథలు కూడా బాలీవుడ్ లో రాబోతున్నాయి. వారిలో ఒకరు భారతజట్టు మాజీ కెప్టెన్ అజారుద్దీన్, ఇంకోకరు ప్రస్తుత వన్డే కెప్టెన్ ఎంఎస్ ధోనీ. సీరియల్ కిస్సర్ అజారుద్దీన్ పాత్రలో, ధోనీ పాత్రలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించనున్నారు. ఇక కాంట్రవర్సరీ నేపథ్యంలో క్రిమినల్ చార్లెస్ శోభరాజ్ జీవిత చరిత్ర కూడా చిత్రం రూపంలో రానుంది. ఇందులో రణ్ దీప్ హూడా ప్రధాన పాత్రధారిగా నటించనున్నాడు. ప్రముఖ కవయిత్రి అమ్రుత ప్రీతం జీవిత కథతో తెరకెక్కుతున్న చిత్రంలో ముక్కపుడక సోయగం సోనాక్షి సిన్హా నటించనుంది. నటి నీరజ్ భాందోత్ బయోపిక్ లో సోనమ్ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇలా ఈ యేడు బయోపిక్ లతో బాలీవుడ్ షేక్ చేయబోతుందన్నమాట.