షాహిద్ కపూర్ పెళ్ళి చేసుకుంటున్నాడు... నిశ్చితార్థం అయిపోయింది.... పెళ్ళి డిసెంబర్ అంటూ వచ్చిన వార్త ఉత్తిదేనంట... పరిచయం మాట మాత్రం నిజమేనట.... ‘రాధాస్వామి సత్సంగ్ బియాస్’ ద్వారా వీరిద్దరూ స్నేహితులయ్యారట. కానీ మిగతా ముచ్చటంతా అబద్దం... పుకార్లంటూ ఆ అమ్మడు మీరా రాజ్ పుత్ చెప్పుకొచ్చింది. తాను షాహిద్ కపూర్ తో డేటింగ్ చేయలేదని, పెళ్లి కూడా చేసుకోవడం లేదని ఆమె తేల్చి చెప్పింది. అలాగే.. ఆమె క్లాస్ మేట్ కూడా వారి పెళ్లిపై వచ్చిన వార్తలను ఖండించింది. వయసులో ఇద్దరికీ 13 ఏళ్ళ వ్యత్యాసం ఉంది. మీరా షాహిద్ ను పెళ్ళి చేసుకోవడం ఏంటని? ప్రశ్నించింది. ఈ ఇరువురికి పరిచయం మాత్రం ఉంది అంతే నట.