ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు భాగ్యరాజు తనయుడు శాంతన్ భాగ్యరాజ్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ప్రముఖ తమిళ టీవీ యాంకర్ కీర్తి తో శాంతన్ త్వరలో కీర్తితో కలిసి పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఈ విషయాన్ని దర్శకుడు భాగ్యరాజే స్వయంగా మీడియాకు తెలియజేశాడు. ఇరు కుటుంబాల మధ్య మాటలు జరిగినట్లు ఆగష్టు 21వ తేదీన చెన్నైలోని ఇస్కాన్ టెంపుల్ లో వివాహం జరుగుతుందని, ఆ మరుసటి రోజే గ్రాండ్ గా రిసెప్షన్ ను నిర్వహించనున్నట్లు ఓ ప్రకటనలో భాగ్యరాజ్ తెలిపారు. బాలనటుడిగా పరిచయమైన శాంతన్ ప్రస్తుతం హీరోగా ఓ రెండు మూడు చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇక కీర్తి కలైంగర్ చానెల్ లో ప్రసారమయ్యే మనాదా మలియాద్ అనే డాన్స్ బెస్డ్ రియాల్టి షో ద్వారా బాగా పాపులర్ అయ్యింది. గత కొద్ది రోజులుగా ప్రేమాయణం నడుపుతున్న వీరిద్దరికి ఈ మధ్యే ఆయా కుటుంబాలు పచ్చజెండా ఊపాయి. అన్నట్లు శాంతన్ ‘లవ్ ఇన్ హైదరాబాద్’ అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచతమే లేండి.