జీరో సైజ్ హీరోయిన్ కరీనా కపూర్ పెళ్ళి తరువాత కాస్త నిండుగా కనిపిస్తోంది అంటే... దుస్తుల పరంగా... లుక్స్ పరంగా... సినిమాలు కూడా అదే మోస్తరుగా కనిపిస్తున్నాయనుకోండి. జీరో సైజ్ కు మారి బికినీల్లో అదరగొట్టిన ఈ భామ కత్తిలాగా వుంటేనే కుర్రకారుకు చాలా ఇష్టమట. యువత కరీనాను సెక్సీగా, హాట్ గా గ్లామర్ గా వుండాలని కోరుకుంటారు. అభిమానుల్లాగే కరీనా అత్త శర్మిలా ఠాగూర్ కూడా కోరుకోవడం విచిత్రంగా ఉంది కదా... మరి ఆమె కూడా ఒకప్పటి నటి కాబట్టి నటీమణులు ఎలా ఉంటుందో తెలుసు కదా ఆవిడకు. అత్త తనను సెక్సీగా ఉండడం కోరుకుంటోందన్న విషయాన్ని కరీనాయే చెప్పుకుంటోంది. కరీనా కపూర్ సైఫ్ అలీఖాన్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తన అత్తకు తాను ఎలా వుంటే ఇష్టమో ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకుంది. తన అత్త షర్మిలాకు తనని గ్లామర్ పాత్రలో చూడటానికే ఇష్టపడతారని తెలిపారు. అలాగే ‘దబాంగ్2’ లో తాను చేసిన ‘ఫెవికోల్...’ ఐటెం సాంగ్ అంటే షర్మిలకు చాలా ఇష్టమని కరీనా చెపుతోంది. అంతే కాకుండా తన డాన్సంటే ఆవిడకు చాలా ఇష్టమంటోంది. కరీనా ప్రస్తుతం హీరోయిన్ గా నటిస్తున్న ‘భజ్రంగీ భైజాన్’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో కరీనా పల్లెటూరి పంజాబీ పిల్లగా కనిపిస్తోంది. గ్లామర్ చూపించలేని పాత్ర పాపం. అత్త చాలా అసంతృప్తిగా ఉన్నట్టుంది.