బాలీవుడ్ బాద్ షా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన నటుడుగా పేరు తెచ్చుకున్నాడు. అయితే 2013లో అత్యంత ధనికుల లిస్టులో మొదటి పది స్థానాల్లో తాను రెండవ స్థానం పొందాడట. ఈ వార్తను మన ఇండియన్ మీడియా వాళ్ళు తనను ఆకాశానికెత్తేశారు. ఆయన మాత్రం పెద్దగా స్పందించకుండా ‘‘డబ్బు విషయంలో కాదు.. అభిమానంలో నేను అత్యంత ధనికుణ్ణి. ప్రపంచవ్యాప్తంగా ప్రేమను పంచే అభిమానులు కొన్ని కోట్ల మంది ఉన్నారు. అదే నాకు సంపద’’ అని అన్నారట. అయితే ఆయన మరో విషయం చెప్పుకొచ్చారు. ‘హ్యాపీ న్యూ ఇయర్’ షూటింగ్ సమయంలో ఆ నిర్మాతలు ఫోన్ చేసి మా వద్ద ఉన్న డబ్బంతా అయిపోయింది ఇక షూటింగ్ చెయ్యలేమని చెప్పారట. వెంటనే షారూఖ్ పెళ్ళిళ్ళకు, మరికొన్ని శుభ కార్యాలకు డాన్స్ చేసి, ఆ డబ్బును నిర్మాతలకిచ్చి, ఆ సినిమాను పూర్తి చేయించాడట. అలా నిర్మాతలకు హామీ ఇచ్చి ఫోన్ పెట్టగానే ట్విటర్‌లో ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ధనికుల్లో తను రెండో స్థానంలో ఉన్నట్టు చదివాడట. ఆ సమయంలో ఆయనకు నవ్వొచ్చిందట. అంటే షారూఖ్ ఏం చెపుతున్నట్టు... తను ధనుకుడిని కాననా, తన వద్ద డబ్బు లేకే డాన్స్ చేశాననా...? ఈ న్యూస్ క్లారిటీగా లేదు కదా?