ఒక్కటైన సినీ ఖాన్ లు...

May 27, 2015 | 04:19 PM | 45 Views
ప్రింట్ కామెంట్
sharukh_salman_ameer_niharonline

సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్ ఈ ఖాన్ దాన్ లు బాలీవుడ్ సినీ పరిశ్రమను ఏలేస్తున్న ప్రముఖులు. సహజంగా పోటీతత్వం ఉంటుంది. అప్పుడప్పుడూ జలసీలు... విమర్శలు కూడా సహజమే... మరి ఏక కాలంలో ఏలుతున్న హీరోలాయె.... అలాంటిది సల్మాన్ కు శిక్ష పడడం... దీంతో పలకరింపులు ఓదార్పులతో అందరూ ఒక్కటై పోయారు. బాలీవుడ్‌లోని చిన్న, పెద్ద అంతా అతనికి సంఘీభావం తెలపడం... సల్మాన్‌కి బెయిల్‌ మంజూరు కావడం, పడిన శిక్ష కూడా రద్దు అయిపోవడం జరిగిపోయాయి. ఏదైతేనేం ఈ సంఘటన మొత్తంలో ఇప్పుడు సల్మాన్ కు శత్రువులు లేకుండా పోయారు. చాలా కాలంగా ఎడమొహం పెడమొహంగా ఉంటోన్న షారుక్‌, సల్మాన్‌ ఇప్పుడు భాయ్‌, భాయ్‌ అయిపోయారు.  తనకి కష్టకాలంలో అండగా ఉండి సపోర్ట్‌ ఇచ్చిన షారుక్‌ని ఇప్పుడు సల్మాన్‌ చాలా గౌరవిస్తున్నాడు. అతని కొత్త సినిమా ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ అయితే దాని గురించి ట్వీట్‌ చేసి, హీరోగా ఉండడం కంటే సోదరుడిగా ఉండడమే మిన్న అంటూ షారుక్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. బజరంగి భాయ్‌జాన్‌ ఫస్ట్‌ లుక్‌ని షారుక్‌తో పాటు అమీర్‌ ఖాన్‌ కూడా ట్వీట్‌ చేసాడు. దీంతో ఖాన్లంతా ఒక్కటైపోయారు. ఇంటి ఫంక్షన్లు, గెట్ టూ గెదర్ లు,  సినిమా ఫంక్షన్లలో ఖాన్ లంతా ఒకే చోట చేరిపోయి, అభిమానులను అలరిస్తారన్నమాట...

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ