‘రన్ రాజా రన్’, ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న యంగ్ హీరో శర్వానంద్ ఇప్పుడు మరో సినిమాకి శ్రీకారం చుడుతున్నాడు. ఈ సినిమాకి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించనున్నాడు. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ తర్వాత మేర్లపాక గాంధీ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. శర్వానంద్ తో రన్ రాజా రన్ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన యు.వి.క్రియేషన్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాని ఈ ఏప్రిల్ 17న లాంఛనంగా ప్రారంభించనున్నారని వార్తలు వినపడుతున్నాయి. మిగతా నటీనటులు, టెక్నిషియన్స్ వివరాలు కూడా అప్పుడే తెలుస్తాయట.