ఈ మాజీ ‘గాఢ’ ప్రేమికులు ఒకటయ్యారు

February 14, 2015 | 03:17 PM | 15 Views
ప్రింట్ కామెంట్
IdhuNammaAalu_niharonline

నయనతార, శింబుల గాఢ ప్రేమ అప్పట్లో కోలీవుడ్ కోడై కూసింది. అంతేనా దాదాపు ఇండియన్ సినిమా ఫీల్డంతా మాట్లాడుకుంది వీరి గురించి. మరి ఏం జరిగిందో కానీ విడిపోయారు. ఈ జంటను మళ్ళీ కలపాలనిపించిందో, లేక ఈ జంటతో కాసులు పండించుకుందామనుకున్నారో గానీ ఈ ఇద్దరితో ‘ఇధు నమ్మ ఆలు’ అనే సినిమాతో ఒక్కటి చేశాడు డైరెక్టర్ పండిరాజ్, అన్నట్టు ఈ చిత్రానికి నిర్మాత ఎవరో కాదు హీరో శింబు. ఇప్పుడు అందరి కళ్ళూ ఈ సినిమా మీదే... విడుదలైన పోస్టర్లు, టీజర్ కూడా అందరినీ ఆకట్టు కుంటున్నాయి. విడిపోయిన ఈ జంట కెమిస్ట్రీ ఎలా ఉందో చూడాలని అటు సినిమా వాళ్ళూ, అభిమానులూ ఉత్సాహ పడుతున్నారు. కొందరయితే ఇద్దరూ మనసు మార్చుకుని మళ్ళీ కలిసిపోయారుంటూ పుకార్లు కూడా పుట్టిస్తున్నారు. ఇది ఆలూమగల సినిమా కావడం పోస్టర్లన్నీ చాలా నాచురల్ జంటగా కనిపించడం కొందరిని ఆనందానికి గురి చేస్తోంది. రీసెంట్ గా డైరెక్టర్ ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే ఈ సినిమా కోసం తను కొత్తగా ఏమీ రచించలేదనీ, కేవలం వాళ్ళిద్దరినీ తెరపై చూపించాలన్నదే తన తాపత్రయమని చెప్పుకున్నాడు కూడా. కానీ నయన తార మాత్రం తన తల్లిదండ్రులు ఎంపిక చేసిన వ్యక్తినే పెళ్ళి చేసుకుంటానని స్టేట్మెంట్ ఇచ్చేసింది. తిరిగి కలిసి నటించిన ఈ గాఢ ప్రేమికుల సినిమాను వాలెంటెయిన్స్ డే రోజు విడుదల చేస్తారన్న టాక్ కూడా వినిపించింది. ఏదేమైనా తమిళనాడులో ‘ఇధునమ్మ ఆలు’ ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాలో శింబు సోదరుడు కురలారసన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయమవుతున్నాడు. శింబు సినీ ఆర్ట్స్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రం ఏప్రిల్ లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ