మా ఎన్నికల్లో మాటల యుద్ధం

March 26, 2015 | 12:18 PM | 27 Views
ప్రింట్ కామెంట్
shivaji_raja_ali_niharonline

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఏర్పడి రెండు దశాబ్దాలు గడిచింది. ఇప్పటి వరకూ పదవులకు పోటీ అనేది లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సారి మాత్రమే పోటీ రసవత్తరంగా జరుగుతుండగా, ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకోవడం ఇదే మొదటి సారి.  నటుడు శివాజీ రాజా హాస్య నటుడు అలీపై నేరుగానే విమర్శలకు దిగారు. 30 ఏళ్ల తమ స్నేహానికి అలీ నమ్మకం ద్రోహం చేసాడని ధ్వజమెత్తాడు. ‘మా' ఎన్నికల్లో ఒకరు పోటీలో ఉంటే మరొకరు చేయకూడదని ముందే అనుకున్నామని, అలీ పోటీ చేయనని చెప్పిన తర్వాతే తాను నామినేషన్ వేశానని, ఇప్పుడు అలీ పోటీకి దిగడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యానని ఆవేదన వ్యక్తంచేశాడు. ఈ నేపథ్యంలో తాను నామినేషన్ ఉపసంహరించుకోవాల్సి వచ్చిందన్నాడు. ఇలాంటి పరిస్థితి మా ప్యానల్‌కు రావడం మా ఖర్మ అంటూ వ్యాఖ్యానించాడు. తాను ఎవరో బెదిరించడం వల్ల ఉపసంహరించుకోలేదని చెపుతూ, ‘మా’ అసోషియేషన్‌లో చాలా పదవులు చేపట్టానని, నిధుల సేకరణలో సహాయం చేశానని అన్నాడు. మరో రెండేళ్ల వరకు అసోసియేషన్ మెట్లు కూడా తొక్కనని శివాజీరాజా అనడంతో తాను తీవ్రంగా కలతచెందినట్టు తెలుస్తోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ