కృష్ణుడు హీరోగా శ్రీ శివపార్వతి కంబైన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1 గా ‘నాకూ ఓ లవరుంది’ చిత్రాన్ని నిర్మించి మొదటి చిత్రంతోనే మంచి అభిరుచి వున్న నిర్మాతగా ప్రేక్షకుల్లోనూ, చిత్ర పరిశ్రమలోనూ మంచి పేరు తెచ్చుకున్నారు నిర్మాత కె.సురేష్‌బాబు. రెండో ప్రయత్నంగా ఒక బర్నింగ్ ప్రాబ్లమ్‌ని తీసుకొని ‘దక్షిణ మధ్య భారతజట్టు’ పేరుతో ఓ మెసేజ్ ఓరియంటెడ్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం నిర్మాణంలో వుండగానే ఇప్పుడు ప్రొడక్షన్ నెం.3గా ఓ విభిన్న చిత్రానికి శ్రీకారం చుడుతున్నారు కె.సురేష్‌బాబు. ఏక్తా కపూర్ దగ్గర వర్క్ చేసిన ప్రశాంత్ వర్మ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడట. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని, మే నెలలో సినిమా ప్రారంభమవుతుందని నిర్మాత తెలియజేశారు.