విశ్వాసానికి ప్రతి రూపాల్ని చైనాలో చంపుకు తింటారట.... ప్రతి సంవత్సరం చైనాలో ‘యులిన్ డాగ్ మీట్ ఫెస్టివల్' పేరుతో ఓ ఉత్సవం జరుగుతుందట. ఈ ఉత్సవంలో వేలాది కుక్కలను చంపేస్తారు. ఆ రకంగా ఇండియాలో కక్కలా పుట్టడం అదృష్టమనే అనుకోవాలి. ప్రతి సంవత్సరం జూన్ 21న ప్రారంభమయ్యే ఈ ఫెస్టివల్ లో దాదాపు 10వేల కుక్కలను బలిస్తారట, ఇలా కుక్క మాంసం తినడంపై పోరాటం చేయాలని నిర్ణయించుకుంది ఓ హీరోయిన్. ఆమె మరెవరో కాదు రవితేజ సరసన ‘నేనింతే' సినిమాలో నటించిన శీయ గౌతం. కుక్కలను చంపడం ఆపాలని, కుక్క మాంసం తినడాన్ని నిషేదించాలని ఆన్ లైన్ పోరుకు దిగింది. ఈ పోరుకు మరింత మందిని కూడగట్టేందుకు సిద్ధమవుతోంది. చైనాలో ఈ డాగ్ మీట్ ఫెస్టివల్ జూన్ 21, 22 తేదీల్లో జరుగుతుంది. ఈ ఫెస్టివల్ కోసం ఆ రెండు రోజుల్లో దాదాపు పదివేల కుక్కల్ని చంపుతారట. కుక్కలే కాదు, పిల్లుల మాంసం కూడా తింటారట. ప్రతి ఏడాది చైనాలో 2 కోట్లకు పైగా కుక్కలు మాంసాహారం అవుతాయట. కుక్క మాంసం తినడం వల్ల తమకు దెయ్యాలను ఎదుర్కొనే శక్తి వస్తుందని, కొన్ని రకాల వ్యాధులు రావని చైనీయుల నమ్మకం. కుక్క మాంసం శృంగార శక్తిని పెంచుతుందని కూడా నమ్ముతారట.